Chandrababu : ప్రస్తుతానికి సీఐడీ కేసులో గట్టెక్కిన చంద్రబాబు.. కానీ వాట్ నెక్స్ ట్?
Chandrababu : అనుకున్నట్టే జరిగింది. ఇది అందరూ ఊహించిందే. ఖచ్చితంగా రాజధాని అమరావతి భూముల వ్యవహారంలో చంద్రబాబుకు చుక్కెదురవుతుందని.. అందరూ ఊహించినట్టే సీఐడీ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సీఐడీ కేసు నమోదు చేసింది. అయితే.. ఆదిలోనే సీఐడీకి షాక్ తగిలింది. చంద్రబాబు ప్రస్తుతానికి ఈ కేసు నుంచి గట్టెక్కగలిగారు.
చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణపై సీఐడీ వేసిన కేసులపై, వారిపై విచారణపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. అమరావతి భూముల వ్యవహారంపై సీఐడీ కేసులు నమోదు చేయగానే.. ఆ కేసులను కొట్టేయాలంటూ.. చంద్రబాబు, నారాయణ.. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ చేపట్టిన కోర్టు.. వాళ్లపై పెట్టిన కేసులకు సంబంధించిన ఆధారాలను చూపాలంటే సీఐడీని ప్రశ్నించింది.
ఇప్పుడే ప్రాథమిక విచారణ జరుగుతున్నందున ఇప్పుడే ఆ వివరాలు కోర్టుకు చెప్పలేమని.. సీఐడీ తరుపు న్యాయవాది కోర్టుకు చెప్పడంతో.. సీఐడీ విచారణపై హైకోర్టు స్టే విధించింది. దీంతో సీఐడీ విచారణకు చంద్రబాబు, నారాయణ హాజరు కావాల్సిన అవసరం లేకుండా పోయింది.
Chandrababu : దళితుల భూములను లాక్కొని తన బినామీలకు కట్టబెట్టారంటూ చంద్రబాబుపై ఆరోపణ
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా ప్రకటించకముందే.. అక్కడ భూములకు సంబంధించి ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని.. అమరావతిలో ఉన్న దళితుల భూములను అక్రమంగా లాక్కొని.. వాటిని తన బినామీలకు కట్టబెట్టారని చంద్రబాబుపై ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబుతో పాటు నారాయణ కూడా ఈ భూముల వ్యవహారంలో ఇన్వాల్వ్ అయ్యారని.. సీఐడీకి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు.
దీంతో వెంటనే రంగంలోకి దిగిన సీఐడీ.. చంద్రబాబు, నారాయణపై పలు కేసులు నమోదు చేసి విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. దీంతో వెంటనే కోర్టులో ఇద్దరూ క్వాష్ పిటిషన్ ను దాఖలు చేశారు.
Chandrababu : చంద్రబాబు నెక్స్ ట్ స్టెప్ ఏంటి?
అయితే.. చంద్రబాబు నెక్స్ ట్ స్టెప్ ఏంటి.. అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. ప్రస్తుతానికి సీఐడీ కేసును హైకోర్టు స్టే విధించినా.. రేపు.. సీఐడీ అన్ని ఆధారాలను కోర్టుకు సమర్పిస్తే.. చంద్రబాబును విచారించడానికి కోర్టు ఖచ్చితంగా సీఐడీకి పర్మిషన్ ఇవ్వాల్సిందే. ఒకవేళ.. కోర్టు పర్మిషన్ ఇస్తే.. అప్పుడు సీఐడీ విచారణలో చంద్రబాబు ఏం చెబుతారు.. అప్పుడు చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారు.. అసలు అమరావతి అసైన్డ్ భూముల విషయంలో తన ప్రమేయం ఉందా? లేదా? అనే దానిపై ఎటువంటి సమాధానం చెబుతారు? అనే దానిపై ప్రస్తుతం సందిగ్దం నెలకొన్నది.