Banana | ఏడాది పొడవునా దొరికే ఆరోగ్య ఖజానా.. అరటిపండుతో అద్భుత ప్రయోజనాలు!
Banana | మన మార్కెట్లలో సంవత్సరం పొడవునా దొరికే సులభమైన పండు అరటిపండు (Banana). అందరికీ అందుబాటులో ఉండే ఈ పండు రుచికరమైనదే కాదు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పౌష్టికాహారం కూడా. రోజుకు ఒక్క అరటిపండు తినటం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

#image_title
అరటిపండు పోషక విలువలు:
పొటాషియం
మెగ్నీషియం
మాంగనీస్
రిబోఫ్లేవిన్
ఫోలేట్
కాపర్
ఫైబర్
విటమిన్ B6, విటమిన్ C
మొదలైన అనేక మినరల్స్, విటమిన్లు ఉంటాయి.
ఆరోగ్యానికి లాభాలు:
జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది:
తిన్న ఆహారం త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. మలబద్ధకం సమస్యను తగ్గించడంలో అరటిపండు కీలక పాత్ర పోషిస్తుంది.
రక్తపోటు, గుండె జబ్బుల నివారణ:
అరటిపండులోని పొటాషియం బిపిని అదుపులో ఉంచుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
మెదడు, మూడ్‌కు మేలు:
అరటిపండు తినడం వల్ల మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. హార్మోన్‌ల బ్యాలెన్స్‌ను మెరుగుపరుస్తుంది.
శరీర శక్తి కోసం:
వ్యాయామం చేసిన తర్వాత అరటిపండు తింటే తక్షణ శక్తి లభిస్తుంది. నీరసం తగ్గుతుంది.
మూత్రపిండాలకు రక్షణ:
రెగ్యులర్‌గా అరటిపండు తినటం మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఇలా వాడండి:
ఓట్‌మీల్, స్మూథీలు, మిల్క్‌షేక్‌ల్లో కలిపి తినవచ్చు
అరటి చిప్స్, అరటి హల్వా లాంటి స్వీట్లలో ఉపయోగించవచ్చు
సలాడ్స్‌కి టాపింగ్‌గానూ వాడొచ్చు
అరటిపండు ఆరోగ్యానికి మంచిదే అయినా…అలర్జీలు, ఉబ్బసం, సైనస్ ఇన్‌ఫెక్షన్లు ఉన్నవారు దీన్ని తీసుకునే ముందు వైద్యుడి సలహా తీసుకోవడం మంచిది.