Opod House : మురికి నీరు ప్రవహించే పైపుల్లో అద్భుత ఇల్లు నిర్మాణం.. కేవలం రూ.3లక్షలే..!
Opod house : మనదేశంలో చాలా మంది పేద ప్రజలు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఉండటానికి గూడు లేకుండా జీవిస్తున్నారు. కొందరైతే బస్తీల్లో రేకుల షెడ్లు, బ్రిడ్జిల కింద, మురికికాలువల పక్కన దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. అటువంటి వారికోసం తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా బొమ్మకల్‌కు చెందిన సివిల్ ఇంజినీర్ మానస రెడ్డి సరికొత్త ఐడియాతో ముందుకొచ్చారు. కాలువల నిర్మాణం కోసం ఉపయోగించే పైపుల సాయంతో అద్భుత మైన ఇల్లు నిర్మాణం చేస్తున్నారు. ఇందులో ఇద్దరి నుంచి చాలా ఫ్రీగా ఉండొచ్చట..హాంగాంక్‌లో పాపులర్ అయిన Opodsను ఇక్కడి తీసుకొచ్చింది మానస..
ట్యూబ్ మాదిరిగా ఉండే పైపులో ఇంటిని నిర్మిస్తారు.తక్కువ ధరతో మంచి ఫీచర్స్‌తో దీనిని తయారు చేస్తున్నారు.ఇందులో బెడ్ రూం, వాష్ రూమ్, వస్తువులు పెట్టుకునేందుకు ప్లేస్, కిచెన్ కూడా ఉంటాయి. 40 నుంచి 120 చదవరపు అడుగుల విస్తీర్ణంలో ఇవి ఉంటాయి. 15 రోజుల్లో వీటి నిర్మాణం పూర్తి చేయొచ్చట.. దీనికి రూ.3లక్షల నుంచి 8లక్షల వరకు ఖర్చవుతుందని మానస చెబుతుంది.అవసరాన్ని బట్టి దీనిని 1బీహెచ్‌కే నంచి 3 బీహెచ్‌కే వరకు మార్పులు చేసుకోవచ్చట.. అన్నివాతావరణ పరిస్థితుల్లో అనువుగా వుండేలా దీని నిర్మాణం ఉంటుంది. ఈ ఇంటి నిర్మాణం కోసం మానస ఎంతో శ్రమించింది. తండ్రి చనిపోయాక తల్లితో పాటు కుటుంబ బాధ్యతలు స్వీకరించింది.
Opod House : తక్కువ ఖర్చులో బెస్ట్ హౌస్..
తల్లి వద్ద రూ.5లక్షలు అప్పుగా తీసుకుని ముందు సిద్దిపేటలోని ఓ పైపుల వ్యాపారితో మాట్లాడి భారీ పరిమాణం గల పైపును సేకరించింది. అందులో ఇంటికి అవసరమయ్యే అన్నింటిని సమకూర్చింది. ఈ పైపుకు పైన బాల్కనీ కూడా అమర్చారు.ఓ కార్మికుడిని అందులో వారం రోజుల పాటు ఉంచి అతని నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. తర్వాత కొన్ని మార్పులు చేర్పులు కూడా చేశారట.. ఈ హౌస్ సక్సెస్ కావడంతో మానస Samnavi construction పేరుతో ఓ వైబ్‌సెట్ కూడా ప్రారంభించింది. ఇందులో తాను నిర్మించే ఇంటికి సంబంధించి ఫుల్ డిటేల్స్ ఉంటాయి. తన కొలిగ్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ విద్యార్థి నవీన్ రెడ్డితో కలిసి ఈ వ్యాపారాన్ని విస్తరించాలని మానస భావిస్తుంట.. ఈమె చేతిలో 200ల వరకు opods నిర్మాణాలకు చెందిన ఆర్డర్స్ ఉన్నాయట..