Ambati Rambabu : సంక్రాంతి పాటతో కూటమి ప్రభుత్వంపై అంబటి రాంబాబు విమర్శలు.. వీడియో వైరల్
Ambati Rambabu : ఆంధ్రప్రదేశ్ లో గత కొన్నేళ్లుగా ప్రతి ఏడాది సంక్రాంతి Pongal సందర్భంగా ప్రత్యేక పాటను రూపొందించి, అందులో తానే స్వయంగా డ్యాన్స్ చేయడం వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబుకు ఓ ప్రత్యేక గుర్తింపుగా మారింది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌ను కీర్తిస్తూ సంక్రాంతి పాటలు రూపొందించిన అంబటి, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తన రూటు మార్చారు. కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ రూపొందించిన తాజా సంక్రాంతి పాటను ఆయన ఇవాళ విడుదల చేశారు. ఈ సందర్భంగా పాట వెనుక ఉన్న కారణాన్ని కూడా మీడియాతో పంచుకున్నారు. ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చేందుకే ఈ పాట చేశారని వస్తున్న విమర్శలపై అంబటి స్పందించారు. ఇది కౌంటర్ పాట కాదని, ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలను ఐదు నిమిషాల పాటలో ప్రజలకు చెప్పే ప్రయత్నం మాత్రమేనని స్పష్టం చేశారు.

Ambati Rambabu : సంక్రాంతి పాటతో కూటమి ప్రభుత్వంపై అంబటి రాంబాబు విమర్శలు.. వీడియో వైరల్
Ambati Rambabu పవన్ కళ్యాణ్‌పై వ్యాఖ్యలు
ఈ పాట కోసం గత రెండు నెలలుగా సిద్ధమయ్యామని, అన్ని విషయాలను పరిశీలించిన తర్వాతే ఇవాళ ప్రజల ముందుకు తీసుకొచ్చామని అంబటి తెలిపారు. ఇందులో హద్దులు మీరిన విమర్శలు లేవని, పచ్చినిజాలనే చెప్పామని అన్నారు. ప్రజలు ఇవాళ కాకపోయినా రేపైనా ఈ నిజాలను గ్రహిస్తారని, కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని వ్యాఖ్యానించారు. తాను సత్తెనపల్లి నుంచి గుంటూరుకు Guntur మారిన నేపథ్యంలో, ఈ పాటను గుంటూరులోనే రూపొందించామని కూడా అంబటి రాంబాబు వెల్లడించారు. ఇదిలా ఉండగా, సంక్రాంతి అనగానే తన పేరు గుర్తుకు రావడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణేనని అంబటి వ్యాఖ్యానించారు. తాను సంక్రాంతికి డ్యాన్స్ చేస్తే పవన్ తనను ‘సంబరాల రాంబాబు’ అని వ్యాఖ్యానించారని గుర్తుచేశారు. అలాగే ‘బ్రో’ సినిమాలో తన క్యారెక్టర్‌ను పెట్టి తనపై గేలి చేశారని అన్నారు.
మొన్నటి సంక్రాంతికి పవన్ Pawan Kalyan కూడా డ్యాన్స్ చేశారని, అయితే ఆ స్టెప్పులు మాత్రం తనవి కాదని అంబటి పేర్కొన్నారు. పవన్ ఒక సినిమా నటుడిగా తన స్టెప్పులను పాపులర్ చేయడం వల్లే తనకు ఈ స్థాయిలో గుర్తింపు వచ్చిందని వ్యాఖ్యానించారు. ‘సంబరాల రాంబాబు’ అనే పేరు తనకు సరైనదేనని, ఎందుకంటే తాను నిజంగానే సంక్రాంతి సంబరాలు చేసుకుంటానని అన్నారు. అయితే పవన్ మాత్రం అలా చెప్పుకోలేరని, ఆయన రాజకీయ నాయకుడు కాదని, కేవలం నటుడే అని వ్యాఖ్యానించారు. ఆయన ఎప్పటికీ పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారరని, అది ఆయన స్వభావమేనని అంబటి రాంబాబు అభిప్రాయపడ్డారు.