Home » Andhra Pradesh » Ambati Rambabu Counters On Tdp Over Liquor Comments
andhra pradesh

Ambati Rambabu : టీడీపీ వారికి మంత్రి అంబటి రాంబాబు వారి ‘మంచి’ కౌంటర్‌ అదిరింది

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: June 29, 2022, 6:00 am
Advertisement

Ambati Rambabu : తెలుగు దేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం కాదా అని ప్రతి ఒక్క విషయం గురించి ప్రభుత్వంకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయడం విడ్డూరంగా ఉంది అంటూ విమర్శలు వస్తున్నాయి. తెలుగు దేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ఈమద్య కాలంలో వైకాపా ప్రభుత్వం చేసిన ప్రతి ఒక్క పనిని విమర్శిస్తూ ప్రజల్లోకి తప్పుడు సందేశం తీసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలకు అన్ని విషయాలు తెలుస్తున్నాయి. టీడీపీ వారు తప్పుడు ప్రచారం చేసి చివరకు ప్రజల వద్ద చులకన అవుతున్నారు. తాజాగా టీడీపీ నాయకులు మద్యం గురించి చేసిన వ్యాఖ్యలకు అంబటి రాంబాబు ఇచ్చిన కౌంటర్ అదిరింది అంటూ సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది.

Advertisement

వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం కొత్త పాలసీని తీసుకు వచ్చిన విషయం తెల్సిందే. కొత్త పాలసీలో భాగంగా అనేక సంస్కరణలు తీసుకు వచ్చారు. సంస్కరణలు ఏవైనా కొత్తవి తీసుకు వచ్చిన సమయంలో మొదట్లో ప్రజలకు కాస్త ఇబ్బందిగా ఉంటాయి. వాటి ఫలితాలు భవిష్యత్తులో బాగుంటాయి. కనుక వైకాపా కాస్త ఇబ్బంది అయినా మద్యం పాలసీని తీసుకు వచ్చింది. ఇదే సమయంలో ఆ పాలసీ పై తెలుగు దేశం పార్టీ దుమ్మెత్తి పోసినట్లుగా చేస్తున్న వ్యాఖ్యలకు అంబటి రాంబాబు స్పందిస్తూ తెలుగు దేశం పార్టీ నాయకులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Ambati Rambabu counters on tdp over liquor comments

Advertisement

ముఖ్యంగా మంచి మద్యం ఇవ్వడం లేదు అంటూ తెలుగు దేశం పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలపై అంబటి స్పందిస్తూ.. తెలుగు దేశం పార్టీ నాయకులు మంచి మద్యం.. మంచి సిగరెట్లు అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. మద్యం అంటేనే మంచిది కాదు.. దాన్ని జగన్ ప్రభుత్వం దశల వారిగా నిషేదించాలని భావిస్తుంది. అలాంటి మద్యం ను మంచి మద్యం.. చెడ్డ మద్యం అంటూ విభజించడం కేవలం తెలుగు దేశం పార్టీ నాయకులకే చెల్లింది. మంచి మద్యం.. మంచి సిగరెట్లు అనేవి ఉండవు. ప్రతి ఒక్కటి కూడా అనారోగ్య కారకం అంటూ మంత్రి అంబటి ఇచ్చిన కౌంటర్ కు తెలుగు దేశం నుండి సౌండ్ లేకుండా పోయింది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి