Ambati Rambabu : బాబు కక్కుర్తి వల్లే రూ.800 కోట్ల అదనపు భారం అంబటి రాంబాబు
Ambati Rambabu : పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఈనాడు లో వస్తున్న కథనాలపై మంత్రి అంబటి రాంబాబు సీరియస్ అయ్యారు. ఇటీవలే జల వనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న అంబటి రాంబాబు పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించిన విషయాలపై తీవ్రమైన కసరత్తు చేస్తున్నట్లుగా ప్రకటించాడు. పనులు స్పీడ్ గా చేయాలనే ఉద్దేశ్యంతో అధికారులను మరియు కాంట్రాక్టర్ లను ఆదేశించినట్లుగా ఆయన పేర్కొన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్ట్ ల విషయంలో కూడా ఆయన స్పీడ్ కనిపిస్తుంది.
తాజాగా ఈనాడు లో వచ్చిన పోలవరంకు ఏమైంది కథనానికి చాలా సీరియస్ అయ్యాడు. గతంలో చంద్రబాబు నాయుడు పాల్పడిన అక్రమాలు రామోజీరావుకు కనిపించడం లేదా… ఆయన ఏం చేసినా కూడా రామోజీ రావుకు మంచిగానే ఉంటుందా అంటూ అంబటి ప్రశ్నించాడు. ఎందుకు గతంలో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పాల్పడిన అక్రమాల గురించి రామోజీ రావు తన ఈనాడు పేపర్ లో చూపించలేదు అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించాడు.

Ambati Rambabu fire on chandra babu and eenadu ramoji rao about polavaram
పోలవరం కాఫర్ డ్యామ్ మరియు డయా ఫ్రంవాల్ దెబ్బతినడానికి కారణం చంద్రబాబు నాయుడు కాదా అంటూ అంబటి ప్రశ్నించాడు. బాబు కమీషన్ ల కక్కుర్తి వల్లే 800 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది అంటూ అంబటి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ విషయం రామోజీ రావుకు కనిపించదు.. ఈనాడులు ఆ విషయం ఎప్పుడు కూడా వెలుగు లోకి రాదు. కాని తాము ప్రజలుకు ఎంత మంచి చేయాలనుకున్నా… పోలవరం కల నెరవేర్చాలని మేము ప్రయత్నిస్తున్నా కూడా ఈనాడు మాత్రం తప్పుడు రాతలు రాస్తూ ఉందన్నాడు. పోలవరం విషయంలో వైకాపా ప్రభుత్వంకు చిత్తశుద్ది ఉంది.. తప్పకుండా గడువు లోపు పూర్తి అయ్యేలా ప్రయత్నిస్తామంటూ అంబటి పేర్కొన్నాడు.