American Telugu Association : అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో మిల్వాకీ టీం ప్రారంభం
American Telugu Association : అమెరికన్ తెలుగు అసోసియేషన్(ATA) ఆధ్వర్యంలో మిల్వాకీ టీంను ప్రారంభించారు. విస్కాన్సిన్ రాష్ట్రంలో ఈ ఆటా మిల్వాకీ టీంను సెప్టెంబర్ 10న ఆటా ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల చేతుల మీదుగా ప్రారంభించారు. ఆటా టీం సభ్యులను ఈసందర్భంగా ఘనంగా సత్కరించారు. మంగళవాద్యాలతో ఆటా టీం సభ్యులకు ఆహ్వానం పలికారు. ఈనేపథ్యంలో అక్కడ సాండ్ వాలీ బాల్ టోర్నమెంట్ ను నిర్వహించారు. ఈ టోర్నమెంట్ లో మొత్తం 12 టీమ్స్ పాల్గొనగా.. లేవల్ వన్ లో ఎన్బీ కింగ్స్ టీం గెలిచింది. వైకింగ్ టీమ్ రన్నరప్ గా నిలిచింది.
ఆ తర్వాత న్యూ బెర్లిన్ తెలుగు వాళ్లు వండిన వంటకాలతో భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దాదాపు 300 మందికి పైగా ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆటా అధ్యక్షుడు భువనేశ్ మాట్లాడుతూ.. మహిళలు కూడా సమాజ సేవలో పాల్గొనాలన్నారు. ఆటా కార్యక్రమాల గురించి ఆయన ఈసందర్భంగా అందరికీ వివరించారు.
American Telugu Association : ఆటా మిల్వాకీ టీం ఏర్పాటుకు చురుకైన పాత్ర పోషించిన చంద్రమౌళి
ఆటా మిల్వాకీ టీం ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించిన చంద్రమౌళిని రీజనల్ కోఆర్డినేటర్ గా నియమించారు. రీజనల్ డైరెక్టర్ గా పోలిరెడ్డి గంటను నియమించారు. అలాగే.. మిల్వాకీ టీమ్ ఏర్పాటుకు ఆటా సెక్రటరీ హరి ప్రసాద్ రెడ్డి, ఆటా కోశాధికారి సాయినాథ్ రెడ్డి, ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీ మెహెర్ సహకారం అందించారు.
ఆతర్వాత ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన, ప్రోత్సహించిన ఆటా చికాగో టీమ్ సభ్యులకు చంద్రమౌళి ధన్యవాదాలు తెలిపారు. రీజనల్ డైరెక్టర్ పోలిరెడ్డి మాట్లాడుతూ ఆటా కార్యవర్గానికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు.
ఇక.. ఇతర సభ్యులు కరుణాకర్ రెడ్డి దాసరి, వెంకట్ చిగురుపాటి, దుర్గ ప్రసాద్ రబ్బ, వంశీ, శ్రీకాంత్ కురుమద్దాలి, జగదీష్ కట్ట, కాచినేని వినోద్ కుమార్, అనీల్ వెంకటప్పాగారి, పర జయంత్, పెద్దగోర్ల లక్ష్మీరెడ్డి, నల్లూరి గంగాధర్, గోపాల బలిపురా, నారాయణస్వామి, గారపాటి ఫణి, పువ్వాడి శరత్, ప్రసాద్ జయంత్, బాదాం జగదీష్, చంద్రశేఖర్ ఈ కార్యక్రమం విజయంలో ప్రముఖ పాత్ర పోషించారు.