Anam : తిరుపతి ఉపఎన్నికపై ఆనం రామనారాయణ రెడ్డి యూటర్న్?
Anam : ఆనం రామనారాయణ రెడ్డి తెలుసు కదా. ఆయన నెల్లూరు జిల్లాలోనే కాదు.. ఏపీ మొత్తం మీద సీనియర్ రాజకీయ నేత. నెల్లూరు రాజకీయాలను ఒక మలుపు తిప్పిన నేత ఆనం. కాంగ్రెస్ హయాంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనం రామనారాయణరెడ్డి మంత్రగా పనిచేశారు. అప్పుడే కాదు చాలాసార్లు ఆయన మంత్రిగా పనిచేశారు.కాంగ్రెస్ లో ఓ వెలుగు వెలిగిన నేత ఆనం రామనారాయణరెడ్డి. కానీ… రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. అయితే… టీడీపీలో ఉన్నప్పుడు ఆనంకు సరైన గుర్తింపు రాలేదని… ఆనం… 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు.
వెంకటగిరి నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. కానీ… సీఎం జగన్ కూడా ఆనంను పెద్దగా పట్టించుకోలేదని విమర్శ లేకపోలేదు.మధ్యలో ఆనంకు, సీఎం జగన్ కు మధ్య కొన్ని విభేదాలు ఉన్నాయని వార్తలు కూడా వచ్చాయి. అయితే.. తాజాగా తిరుపతి ఉపఎన్నిక నేపథ్యంలో వైసీపీలో ఎమ్మెల్యే ఆనం చర్చకు దారి తీశారు. తిరుపతి ఉపఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం ఆనం అవసరం ఎంతైనా ఉంది.కాకపోతే.. సీఎం జగన్ తో ఉన్న విభేదాల కారణంగా ఆనం… వైసీపీ గెలుపు కోసం పనిచేస్తారా? చేయరా? అనే దానిపై సందేహం ఉన్న తరుణంలో… ఆనం యూటర్న్ తీసుకున్నారు. తాజాగా ఆయన సీఎం జగన్ పై ప్రశంసలు కురిపించారు.
Anam : జగన్ పై పాజిటివ్ గా రియాక్ట్ అయిన ఆనం
సీఎం జగన్.. తన తండ్రి వైఎస్సార్ లాగానే గ్రేట్ అంటూ ఆనం కితాబు ఇచ్చారు. తిరుపతి ఉపఎన్నిక నేపథ్యంలో మాట్లాడిన ఆనం…. వెంకటగిరి నియోజకవర్గంలో తాగునీటి సమస్యను పరిష్కరించడం కోసం సీఎం జగన్ తనకు హామీ ఇచ్చారని ఈసందర్భంగా గుర్తు చేశారు.పేదల కోసం ఎంతో చేస్తున్న జగన్ ప్రభుత్వంపై ఏపీ ప్రజల విశ్వాసం కూడా అంతే స్థాయిలో ఉంది. వెంకటగిరి నియోజకవర్గం నుంచి సుమారు 80 వేల మెజారిటీని తీసుకొచ్చి వైసీపీ అభ్యర్థి గురుమూర్తిని గెలిపిస్తామని ఆనం మాటిచ్చారు.
ఆనం రామనారాయణ రెడ్డి పాజిటివ్ గా మాట్లాడటంతో వైసీపీ నేతల్లో సంతోషం ఉప్పొంగింది. వైసీపీ విజయం కోసం కృషి చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని.. ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొంటానని ఆనం స్పష్టం చేశారు.మొత్తం మీద ఆనం సపోర్ట్ కూడా తిరుపతి ఉపఎన్నికల్లో వైసీపీకి రావడంతో… తిరుపతి ఉపఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి గెలవడం పక్కా అంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.