Ananadayya Medicine : ఆనందయ్య మందు పేరుతో నకిలీ మందు మార్కెట్ లోకి.. అసలైన మందు ఏదో ఎలా తెలుసుకోవాలి?
Anandayya Medicine : ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య.. కల్తీ. ప్రతి దాన్ని కల్తీ చేసేస్తున్నారు. అందుకే కదా.. ఈ వైరస్ లు మనల్ని అటాక్ చేస్తున్నాయి. తినే తిండి కూడా కల్తీనే అయిపోయింది. అన్నీ కల్తీనే. చివరకు ప్రజల ప్రాణాలను కాపాడటానికి ఆనందయ్య తయారు చేసిన కరోనా ఆయుర్వేద మందును కూడా కల్తీ చేసేస్తున్నారు. దాన్ని కల్తీ చేసి సొమ్ము చేసుకొని ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అందుకే ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

anandayya ayurvedic medicine in black market
నిజానికి.. ఆనందయ్య కరోనా మందును ఇదివరకు కృష్ణపట్నంలోనే దాన్ని తయారు చేసిన దగ్గరే ఉచితంగా అందించేవారు. దీంతో దాన్ని అప్పుడు కల్తీ చేసే అవకాశం రాలేదు. కానీ.. ఇప్పుడు ఆ మందును అక్కడ పంపిణీ చేయడం కుదరదని.. వేల సంఖ్యలో జనాలు అక్కడికి వస్తుండటంతో.. ప్రతి జిల్లాలో తామే పంపిణీ చేస్తామని ఆనందయ్య ప్రకటించారు. దాని కోసం ఒక వెబ్ సైట్ ను కూడా రూపొందించి.. దాంట్లో రిక్వెస్ట్ పెడితే.. మందును పంపిస్తారు. అయితే.. ఆనందయ్యకు ప్రభుత్వం నుంచి అనుకున్న సహకారం అందడం లేదు. దీంతో మందు పంపిణీలో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి.
ఇప్పటికే ఆనందయ్య మందు తయారీకి సంబంధించిన ఫార్ములా అందరికీ తెలియడం.. దాంట్లో ఎటువంటి మూలికలు వాడుతారో కూడా తెలియడంతో.. కొందరు దాన్ని వ్యాపారం చేస్తున్నారట. ఆనందయ్య మందులాగానే కొన్ని మూలికలతో తయారు చేసి.. ఆనందయ్య మందు అంటూ నెల్లూరు ప్రాంతంలో విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. కొందరు ఉచితంగా ఇస్తున్నా.. మరికొందరు.. ఒక్కో ప్యాకెట్ ను వెయ్యి నుంచి రెండు వేల రూపాయల వరకు అమ్ముతున్నారట.
Anandayya Medicine : ఆనందయ్య అసలు మందేదో తెలియక.. సతమతమవుతున్న జనాలు
దీనివల్ల.. ఆనందయ్య అసలు మందు ఏదో తెలియక జనాలు సతమతమవుతున్నారు. ఎవరైనా డబ్బులకు మందును అమ్ముతున్నారంటే.. అది ఆనందయ్య మందు కాదని ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే.. ఆనందయ్య మందును డబ్బులకు అమ్మరు. ఎక్కడైనా ఉచితంగానే పంపిణీ చేస్తున్నారు. మార్కెట్ లో వచ్చే నకిలీ మందును చూసి ప్రజలు మోసపోవద్దు. అఫిషియల్ గా ఆనందయ్యకు చెందిన వ్యక్తుల దగ్గర్నుంచే.. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే మందును ఉచితంగా తీసుకోవాలని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. తొందరపడి ఏ మందు పడితే ఆ మందు వాడితే లేనిపోని సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.