Krishnapatnam Anandayya : స్వగ్రామానికి చేరుకొని మందు తయారీని ప్రారంభించిన అనందయ్య.. ఆ రోజు నుంచి మందు పంపిణీ షురూ?
Krishnapatnam Anandayya : కృష్ణపట్నం ఆనందయ్య గురించే గత కొన్ని రోజుల నుంచి చర్చ. ప్రస్తుతం ఆయన ఇచ్చే కరోనా మందుకు ప్రభుత్వం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇన్ని రోజులు ఆయన మందును ఢిల్లీకి టెస్టుకు పంపించారు. అక్కడి నుంచి నివేదిక పాజిటివ్ గా రావడంతో.. ఆనందయ్య మందు పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఓకే చెప్పేసింది. దీంతో ఆనందయ్య తన స్వగ్రామానికి చేరుకున్నారు. ఆయన వస్తున్నారని తెలియగానే.. జనాలు మొత్తం అక్కడ గుమికూడారు. ఆయనకు హారతులు పట్టి స్వాగతం పలికారు.
ప్రభుత్వం తన మందుకు అనుమతి ఇవ్వడంతో.. మందు తయారీలో ఆయన నిమగ్నం అయ్యారు. ఇప్పటికే తన శిష్యులు.. కరోనా మందు తయారీకి కావాల్సిన వన మూలికలను సేకరించారు. ఈరోజు నుంచి కరోనా మందు తయారీని ప్రారంభిస్తామని ఆనందయ్య మీడియాకు తెలిపారు. అయితే.. మందు తయారీకి కనీసం మూడు రోజుల సమయం పడుతుందని ఆయన వెల్లడించారు.
Krishnapatnam Anandayya : కరోనా ఉన్నవాళ్లు కృష్ణపట్నం రాకండి
అయితే.. చాలామంది కరోనా ఉన్నవాళ్లు కూడా మందు కోసం ఇక్కడికి వస్తున్నారని.. కరోనా ఉన్నవాళ్లు కాకుండా.. వాళ్ల బంధువులు ఎవరైనా ఇక్కడికి వచ్చి మందు తీసుకుపోవాలని ఆనందయ్య కోరారు. ఖచ్చితంగా ఇక్కడ కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని.. సోషల్ డిస్టెన్స్ పాటించాలని ఆయన తెలిపారు. మరో మూడు నాలుగు రోజుల్లో మందు పంపిణీని ప్రారంభిస్తామని.. అప్పటి వరకు ఎవ్వరూ ఇక్కడికి రావొద్దని ఆనందయ్య కోరారు. కంట్లో వేసే చుక్కల మందు తప్పించి.. మిగితా రకాల మందులను ఆనందయ్య తయారు చేస్తున్నారు. మందు తయారీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ.. మందు తయారు చేశాక.. మరోసారి ఆయుష్ డిపార్ట్ మెంట్, ప్రభుత్వంతో మాట్లాడి.. అన్ని జాగ్రత్తలు తీసుకొని మందు పంపిణీని ప్రారంభిస్తామని ఆనందయ్య హామీ ఇచ్చారు.