Police : ఇదేనా ఫ్రెండ్లీ పోలీస్ అంటే.. వృద్ధుడు అని కూడా చూడకుండా రైతుని ఈడ్చుకెళ్ళిన పోలీస్ అధికారి.. వీడియో ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Police : ఇదేనా ఫ్రెండ్లీ పోలీస్ అంటే.. వృద్ధుడు అని కూడా చూడకుండా రైతుని ఈడ్చుకెళ్ళిన పోలీస్ అధికారి.. వీడియో !

 Authored By ramu | The Telugu News | Updated on :4 June 2025,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Police : ఇదేనా ఫ్రెండ్లీ పోలీస్ అంటే.. వృద్ధుడు అని కూడా చూడకుండా రైతుని ఈడ్చుకెళ్ళిన పోలీస్ అధికారి..!

  •  వృద్ధ రైతు అని కూడా చూడకుండా ఈడ్చిపడేసిన పోలీస్

Police : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ గ్రామానికి చెందిన ఓ వృద్ధ రైతు తన భూమి సమస్యను అధికారులకు వివరించేందుకు భూభారతి సదస్సులో పాల్గొనాలనే ఉద్దేశంతో ఎమ్మార్వో కార్యాలయానికి వచ్చారు. ఎంతో ఆశతో తన సమస్యకు పరిష్కారం లభిస్తుందన్న నమ్మకంతో వచ్చిన ఆ వృద్ధుడిని అధికారుల దృష్టికి తేవడం కూడా మానవీయంగా జరిగే ప్రక్రియ కావాలి. కానీ ఆయనకు అక్కడ ఎదురైన అనుభవం హృదయాన్ని కలిచివేస్తోంది.

Police ఇదేనా ఫ్రెండ్లీ పోలీస్ అంటే వృద్ధుడు అని కూడా చూడకుండా రైతుని ఈడ్చుకెళ్ళిన పోలీస్ అధికారి వీడియో

Police : ఇదేనా ఫ్రెండ్లీ పోలీస్ అంటే.. వృద్ధుడు అని కూడా చూడకుండా రైతుని ఈడ్చుకెళ్ళిన పోలీస్ అధికారి.. వీడియో !

Police : నిర్మల్ లో అమానుషం..వృద్ధుడు అని కూడా చూడకుండా గెంటేసిన పోలీస్

తన సమస్యను వివరించేందుకు ప్రయత్నించిన ఆ వృద్ధ రైతుపై అక్కడ ఉన్న పోలీసు అధికారులు మానవత్వం మరచి దారుణంగా ప్రవర్తించాడు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఏఎస్ఐ కనీసం దయా కూడా లేకుండా, ఆ వృద్ధుడిని అగౌరవంగా, ఈడ్చుకెళ్లిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ప్రజా సేవలో ఉన్న పోలీసుల నుంచి ఇలాంటి ప్రవర్తన ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. వృద్ధుడిపై ఈ రీతిలో ప్రవర్తించడం దారుణమనే ప్రశ్నలు సామాజికంగా తలెత్తుతున్నాయి.

ఈ సంఘటనపై ప్రజలు తీవ్రంగా స్పందిస్తున్నారు. వృద్ధుల పట్ల కనీస గౌరవం లేకుండా ప్రవర్తించే అధికారులు ఎలా ప్రజాసేవ చేయగలుగుతారు అని ప్రశ్నిస్తున్నారు. ఒక రైతు సమస్య చెప్పేందుకు వచ్చినపుడు ఆయనకు సహాయం చేయాల్సిన అధికారులు, పోలీసులే దౌర్జన్యానికి దిగితే ప్రజలు న్యాయం కోసం ఎవరిని ఆశ్రయించాలి? బాధిత రైతుకు న్యాయం జరిగేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని, బాధ్యత కలిగిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పౌర సమాజం డిమాండ్ చేస్తోంది.

ఎమ్మార్వో ఆఫీసులో నా భూమి సమస్య మీద పోయి మాట్లాడుతుంటే నన్ను పోలీస్ అతను గుంజుకొని పోయి బైట వేశాడు నాకు 90 ఏండ్లు.. నన్ను ఇంత ఘోరంగా చేయడం అవసరమా నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ గ్రామంలో వృద్ధ రైతు పట్ల దురుసుగా ప్రవర్తించిన ఏఎస్ఐ ఉన్నతాధికారులకు తన భూమి సమస్య చెప్పుకునేందుకు వస్తే నన్ను కనికరం లేకుండా పోలీసులు ఈడ్చుకెళ్లారంటూ ఆవేదన వ్యక్తం చేసిన వృద్ధ రైతు

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది