Nimmagadda : ఇక నేను రిటైర్ అవుతా? సంచలన వ్యాఖ్యలు చేసిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ?
Nimmagadda – నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. ప్రస్తుతం ఈయన గురించే ఏపీలో హాట్ టాపిక్. ఏ రాజకీయ నాయకుడికి కూడా ఏపీలో ఇంత పలుకుబడి, పాపులారిటీ రాలేదు. నిమ్మగడ్డ అంటే ఏపీలోని చిన్న పిల్లాడికి కూడా తెలుసు. అంతలా ఏపీలో నాటుకుపోయారు నిమ్మగడ్డ. పేరుకు ఎన్నికల కమిషనర్ అయినా.. ప్రభుత్వంతో, సీఎం జగన్ తో కయ్యానికి కాలు దువ్వారు. చివరకు నిమ్మగడ్డే గెలిచారు… పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తున్నారు.
అయితే.. త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. నిమ్మగడ్డ ఈసందర్భంగా షాకింగ్ కామెంట్స్ చేశారు. తన పదవి వీరమణ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Nimmagadda : మార్చి 31న నేను రిటైర్ అవుతున్నా?
వచ్చే మార్చి 31న నేను రిటైర్ అవుతున్నా. నాకు మిగిలింది ఈ పంచాయతీ ఎన్నికలే. వాటిని సమర్థంగా నిర్వహించడమే.. నాకు ఇచ్చే గిఫ్ట్.. అంటూ తన రిటైర్ మెంట్ గురించి ప్రకటించారు నిమ్మగడ్డ.
త్వరలో పంచాయతీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిమ్మగడ్డ తాజాగా తిరుమలకు వెళ్లారు. అక్కడికి వెళ్లిన అనంతరం.. మాట్లాడుతూ.. తిరుపతికి వస్తే.. తన సొంత ఊరికి వచ్చినట్టు ఉంటుందని నిమ్మగడ్డ అన్నారు.
పంచాయతీ ఎన్నికలకు అందరూ సహకరించాలని.. ఎన్నికల అధికారులు, ప్రభుత్వం సహకరిస్తేనే ఎన్నికలు సజావుగా జరుగుతాయని ఆయన అన్నారు. ప్రజలకు ఎన్నికలంటే అస్సలు భయం ఉండకూడదు. వాళ్లు స్వతంత్రంగా, స్వేచ్ఛగా వచ్చి ఓటేయాలి. నా నలబై ఏళ్ల కాలంలో నేను ఎన్నికల కమిషన్ లో పని చేసినప్పుడు ఏ రాజకీయ నాయకుడిని కూడా పల్లెత్తు మాట అనలేదు. ఒకవేళ తప్పు చేస్తే భయపడాలి కానీ.. తప్పు చేయకపోతే.. ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు.. అంటూ నిమ్మగడ్డ ఈసందర్భంగా స్పష్టం చేశారు.