Ramoji Rao – YS Jagan : సరికొత్త స్టెప్ రామోజీ అరస్ట్? జగన్ భారీ స్కెచ్ ! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Ramoji Rao – YS Jagan : సరికొత్త స్టెప్ రామోజీ అరస్ట్? జగన్ భారీ స్కెచ్ !

Ramoji Rao – YS Jagan : మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ కు ఇప్పటికే ఏపీ సీఐడీ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలుసు కదా. తాను ఇక్కడ లేను.. అమెరికాలో ఉన్నాను. వచ్చాక విచారణకు హాజరు అవుతాను అని శైలజా కిరణ్ నెత్తినోరు మొత్తుకున్నా సీఐడీ వినలేదు. ఏపీ ప్రభుత్వం ఆదేశాల మేరకు శైలజకు నోటీసులు జారీ చేసింది. అవి కూడా లుక్ అవుట్ నోటీసులు. అలాగే.. మార్గదర్శి ఆస్తులను కూడా […]

 Authored By kranthi | The Telugu News | Updated on :3 June 2023,10:00 am

Ramoji Rao – YS Jagan : మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ కు ఇప్పటికే ఏపీ సీఐడీ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలుసు కదా. తాను ఇక్కడ లేను.. అమెరికాలో ఉన్నాను. వచ్చాక విచారణకు హాజరు అవుతాను అని శైలజా కిరణ్ నెత్తినోరు మొత్తుకున్నా సీఐడీ వినలేదు. ఏపీ ప్రభుత్వం ఆదేశాల మేరకు శైలజకు నోటీసులు జారీ చేసింది. అవి కూడా లుక్ అవుట్ నోటీసులు. అలాగే.. మార్గదర్శి ఆస్తులను కూడా సీఐడీ అటాచ్ చేసింది. ఈ కేసులో తాజాగా ఈడీ కూడా ఇన్వాల్వ్ అవుతోంది. అంటే.. రామోజీ సామ్రాజ్యం మొత్తంపై ఈడీ కన్నేసే చాన్స్ ఉంది.

ap cid is ready to arrest ramoji rao on margadarsi chit fund case

ap cid is ready to arrest ramoji rao on margadarsi chit fund case

రూ.793 కోట్ల ఆస్తులను ఇప్పటికే సీఐడీ అటాచ్ చేసింది. పూల్ ఖాతాను తన ఆధీనంలోకి తీసుకుంది. ఇది కేవలం ఒక్క మార్గదర్శి కేసు మాత్రమే. ఇంకా రామోజీ గ్రూప్ లోని లూప్ హోల్స్ అన్నింటినీ వెతికి మరీ రామోజీ రావుని ఇరికించాలనే ధోరణిలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఏపీ సీఐడీకి కూడా ఏపీ ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛను ఇచ్చేసింది. ఈ కేసులో ఎంత దూరం అయినా వెళ్లాలని చెప్పింది. ఇటీవల నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ సీఎం జగన్ హాజరు అయినప్పుడే ప్రధానితో పాటు కేంద్రం హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. అప్పుడే 2014 లో అధికారంలోకి వచ్చాక చంద్రబాబు హయాంలో ఎలాంటి అవినీతి జరిగిందో దానిపై నివేదికలు కావాలని సీఐడీ.. జగన్ ను కోరింది.

Andhra Pradesh: CID aggressive in 'Margadarshi' case.. Ramojirao's huge  assets attached.. – Telugu News | Andhra Pradesh CID Attached Ramoji Rao  Properties in the Case of Margadarsi Chit Fund Fraud

Ramoji Rao – YS Jagan : వెంటనే రామోజీరావు ఆస్తులను అటాచ్ చేసిన సీఐడీ

సీఐడీ నివేదిక కోరిన వెంటనే రామోజీరావు ఆస్తులను సీఐడీ అటాచ్ చేసింది. అంటే.. అమిత్ షా నుంచి జగన్ కు ఫుల్ పర్మిషన్స్ వచ్చినట్టే అని అర్థం అయింది. అందుకే ఏపీ సీఐడీ వేగంగా అడుగులు వేస్తోందని తెలుస్తోంది. ఆ తర్వాత మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ కు లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. ఇక.. ఈ కేసులో ఈడీ కూడా వస్తే ఇక మామూలుగా ఉండదు. రామోజీరావుకు ఉన్న ఇతర వ్యాపారాలపై కూడా ఈడీ కన్నేసి అందులో ఏవైనా అవకతవకలు ఉంటే వాటిని తవ్వి తీసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది