YS Jagan : మంత్రి వర్గ విస్తరణకు మరింత సమయం.. జగన్ ఆలోచన అదేనా..? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

YS Jagan : మంత్రి వర్గ విస్తరణకు మరింత సమయం.. జగన్ ఆలోచన అదేనా..?

YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మంత్రి వర్గ విస్తరణ చేపట్టబోతున్నట్లు గత కొంత కాలం నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ నేతలు టెన్షన్ పడపోతున్నారు. ఎవరికి మంత్రి పదవులు వస్తాయి.. మంత్రి పదవిలో ఉన్న వారికి ఎంత మందికి అలాగే కొనసాగే చాన్స్ ఉంటుంది..అనే విషయాలపై చర్చ జరగుతూనే ఉంది. కానీ, ఈ విషయాలపై జగన్ ఎటువంటి స్పష్టత నివ్వడం లేదు.రెండున్నరేళ్లకే మంత్రి వర్గ విస్తరణ ఉండబోతుందని గతంలో జగన్ […]

 Authored By mallesh | The Telugu News | Updated on :8 November 2021,4:10 pm

YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మంత్రి వర్గ విస్తరణ చేపట్టబోతున్నట్లు గత కొంత కాలం నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ నేతలు టెన్షన్ పడపోతున్నారు. ఎవరికి మంత్రి పదవులు వస్తాయి.. మంత్రి పదవిలో ఉన్న వారికి ఎంత మందికి అలాగే కొనసాగే చాన్స్ ఉంటుంది..అనే విషయాలపై చర్చ జరగుతూనే ఉంది. కానీ, ఈ విషయాలపై జగన్ ఎటువంటి స్పష్టత నివ్వడం లేదు.రెండున్నరేళ్లకే మంత్రి వర్గ విస్తరణ ఉండబోతుందని గతంలో జగన్ చెప్పారు. ఈ క్రమంలోనే మంత్రి వర్గంలోకి తీసుకొనబోయేది మొత్తం కొళ్ల వారేననే చర్చ కూడా జరిగింది. కానీ, కేబినెట్ విస్తరణ జరగలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చి 30 నెలలు దాటుతోంది. అయినా తన కేబినెట్‌లో మార్పులు అయితే జరగలేదు. జగన్ చెప్పిన దాని ప్రకారం అయితే, ఈ ఏడాది ఆగస్టు నెలలో మంత్రి వర్గ విస్తరణ జరగాల్సింది.

YS Jagan

YS Jagan

కానీ, అటువంటిది ఏం జరగలేదు. కరోనా కారణంగా కొంత కాలం వాయిదా వేశారని అనుకుంటున్నప్పటికీ ఇప్పుడు ఎందుకు విస్తరణ చేయడం లేదనే ప్రశ్న ఎదురవుతున్నది. ఇకపోతే కొవిడ్ మహమ్మారి వల్ల మినిస్టర్స్ కంప్లీట్‌గా వర్క్ చేయలేదని, అందుకే ఇంకో ఆరు నెలల పాటు ఇప్పటి మంత్రులను అలానే కొనసాగించాలని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే మంత్రి వర్గ విస్తరణ ఉండే చాన్సెస్ ఉంటాయని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే 14 ఎమ్మెల్సీ పదవులకు నోటిఫికేషన్ ఎలాగూ విడుదలవుతుంది. కాబట్టి వైసీపీలో అసంతృప్తితో ఉన్న నేతలకు ఆ పదవులు కట్టబెట్టి.. ఆ తర్వాత మంత్రి వర్గ విస్తరణలో మరికొందరికి అవకాశాలు ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం.

YS Jagan : మరి కొన్ని నెలల ఇలానే..!

గతంలో మాదిరిగా మంత్రి వర్గూ కూర్పునకు ఈ సారి అంత ఈజీగా చాన్సెస్ ఉండబోవని, అందుకే జగన్ కొంచెం సమయం తీసుకున్న తర్వాతనే కేబినెట్ వస్తారని వైసీపీ పార్టీ నేతల అంతర్గత సంభాషణల ద్వారా తెలుస్తోంది. ఇకపోతే ఈ సారి మంత్రి పదవి కోసం ఆశావహులు కూడా చాలా మంది ఉన్న నేపథ్యంలో జగన్ ఆచి తూచి వ్యవహరిస్తున్నట్లు కనబడుతోంది. మొత్తంగా వచ్చే ఏడాది మార్చి వరకు మంత్రి వర్గ విస్తరణ జరిగేలా లేదని వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది