ys jagan
YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మంత్రి వర్గ విస్తరణ చేపట్టబోతున్నట్లు గత కొంత కాలం నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ నేతలు టెన్షన్ పడపోతున్నారు. ఎవరికి మంత్రి పదవులు వస్తాయి.. మంత్రి పదవిలో ఉన్న వారికి ఎంత మందికి అలాగే కొనసాగే చాన్స్ ఉంటుంది..అనే విషయాలపై చర్చ జరగుతూనే ఉంది. కానీ, ఈ విషయాలపై జగన్ ఎటువంటి స్పష్టత నివ్వడం లేదు.రెండున్నరేళ్లకే మంత్రి వర్గ విస్తరణ ఉండబోతుందని గతంలో జగన్ చెప్పారు. ఈ క్రమంలోనే మంత్రి వర్గంలోకి తీసుకొనబోయేది మొత్తం కొళ్ల వారేననే చర్చ కూడా జరిగింది. కానీ, కేబినెట్ విస్తరణ జరగలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చి 30 నెలలు దాటుతోంది. అయినా తన కేబినెట్‌లో మార్పులు అయితే జరగలేదు. జగన్ చెప్పిన దాని ప్రకారం అయితే, ఈ ఏడాది ఆగస్టు నెలలో మంత్రి వర్గ విస్తరణ జరగాల్సింది.
YS Jagan
కానీ, అటువంటిది ఏం జరగలేదు. కరోనా కారణంగా కొంత కాలం వాయిదా వేశారని అనుకుంటున్నప్పటికీ ఇప్పుడు ఎందుకు విస్తరణ చేయడం లేదనే ప్రశ్న ఎదురవుతున్నది. ఇకపోతే కొవిడ్ మహమ్మారి వల్ల మినిస్టర్స్ కంప్లీట్‌గా వర్క్ చేయలేదని, అందుకే ఇంకో ఆరు నెలల పాటు ఇప్పటి మంత్రులను అలానే కొనసాగించాలని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే మంత్రి వర్గ విస్తరణ ఉండే చాన్సెస్ ఉంటాయని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే 14 ఎమ్మెల్సీ పదవులకు నోటిఫికేషన్ ఎలాగూ విడుదలవుతుంది. కాబట్టి వైసీపీలో అసంతృప్తితో ఉన్న నేతలకు ఆ పదవులు కట్టబెట్టి.. ఆ తర్వాత మంత్రి వర్గ విస్తరణలో మరికొందరికి అవకాశాలు ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం.
గతంలో మాదిరిగా మంత్రి వర్గూ కూర్పునకు ఈ సారి అంత ఈజీగా చాన్సెస్ ఉండబోవని, అందుకే జగన్ కొంచెం సమయం తీసుకున్న తర్వాతనే కేబినెట్ వస్తారని వైసీపీ పార్టీ నేతల అంతర్గత సంభాషణల ద్వారా తెలుస్తోంది. ఇకపోతే ఈ సారి మంత్రి పదవి కోసం ఆశావహులు కూడా చాలా మంది ఉన్న నేపథ్యంలో జగన్ ఆచి తూచి వ్యవహరిస్తున్నట్లు కనబడుతోంది. మొత్తంగా వచ్చే ఏడాది మార్చి వరకు మంత్రి వర్గ విస్తరణ జరిగేలా లేదని వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.