YS Jagan : ఏపీ ఉద్యోగులకు సీఎం జగన్ శుభవార్త.. మరో 2 రోజుల్లో ఆ ప్రకటన..!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: January 6, 2022, 4:40 pm

YS Jagan : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. మరో రెండు మూడు
రోజుల్లో ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటిస్తామన్నారు. ఉద్యోగ సంఘాలతో భేటీని ముగించుకున్న కాసేపటికే సీఏం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగ సంఘాలు సమస్యలను పరిగణలోకి తీసుకున్ననాని ఆయన చెప్పారు.

ఉద్యోగులకు తన వల్ల ఎంత జరిగితే అంత మంచి చేస్తానని చెప్పుకొచ్చారు. అలాగే ఉద్యోగులు కూడా రాష్ట్ర ప్రభుత్వం మోయలేని భారాన్ని మోపకుండా కాస్త సానుకూల దృక్పథంతో ఉండాలని ఆయన కోరారు. ఉద్యోగులకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వా నికి, ఉద్యోగులకు మధ్య కొంతకాలంగా పీఆర్సీ నివేదికపై రగడ జరుగుతున్న సంగతి తెలిసిందే.

Ap cm YS Jagan comments prc announcement

Ap cm YS Jagan comments prc announcement

ఈ నేపథ్యంలో సీఏం ప్రకటనతో ఉద్యోగులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీ నివేదిక వచ్చి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం విడుదల చేయుకండా జాప్యం చేస్తోందని కొందకాలంగా ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ ప్రకటన ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఊరటనిచ్చిందని చెప్పాలి.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp