YS Jagan : ఎన్నికల ముంగిట జగన్ మోహన్ రెడ్డి తీవ్ర నిర్ణయం..!
YS Jagan : ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. 2024 లో ఎన్నికలు. కానీ.. ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల కోసం సమాయత్తం అవుతున్నాయి. ఎందుకంటే.. ఇప్పటి నుంచే ఏపీలో ప్రజల నాడి ఏంటో తెలుసుకొని దానికి తగ్గట్టుగా ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే ఒకసారి గెలిచిన వైఎస్ జగన్.. మరోసారి గెలిచి తన సత్తా చాటాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికలకు ముందు వైసీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా బడుగు,
బలహీన వర్గాల కోసం సంక్షేమ పథకాలు కూడా ప్రారంభించారు. నిజానికి పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయంటే దానికి కారణం ఖచ్చితంగా సీఎం జగనే. ఇది వరకు ఎప్పుడూ లేని విధంగా ఏపీలో పలు సంక్షేమ పథకాలను ప్రారంభించారు. ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగకుండా అధికారులే ఇంటింటికి వెళ్లి ప్రజలకు పథకాల గురించి చెప్పి వాటి ఫలాలను అందిస్తున్నారు. ఇదైతే ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచించని ప్రణాళిక. ఒక ముఖ్యమంత్రి సీఎం జగన్ దాదాపు సక్సెస్ అయినట్టే లెక్క. ఈసంవత్సరం వదిలేస్తే వచ్చే సంవత్సరం
YS Jagan : సీఎంగా జగన్ సక్సెస్ అయినట్టేనా?
ఎండాకాలంలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. అయితే.. గతంలో వచ్చినంత మెజారిటీ ఈసారి వచ్చే అవకాశాలు అయితే కనిపించడం లేదు. కొన్ని సర్వేల ప్రకారం.. వైసీపీకి ఈసారి బోటాబోటీ మెజారిటీనే వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. టీడీపీ నుంచి కూడా ఈసారి గట్టి పోటీ ఎదురుకానుంది. ఈనేపథ్యంలో సీఎం జగన్ వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదు. తనకు ఎదురయ్యే సవాళ్లను సీఎం జగన్ ఎలా అధిగమిస్తారో వేచి చూడాల్సిందే.