YS Jagan : ఉత్తరాంధ్రలో 80% ఓట్లు జగన్ పార్టీకే.. రాత్రికి రాత్రి మారిపోయిన ఓటు బ్యాంకు..!
YS Jagan : హమ్మయ్య.. ఇన్నాళ్లకు ఉత్తరాంధ్ర వాసుల కల నెరవేరబోతోంది. ఉత్తరాంధ్ర వాసులు కలకన్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి మే 3న శంకుస్థాపన జరగనుంది. దానికి సంబంధించి సీఎం జగన్ వైజాగ్ పర్యటన కూడా ఖరారైంది. మే 3న ఉదయం 9.20 కి వైజాగ్ ఎయిర్ పోర్ట్ కు విజయవాడ నుంచి బయలుదేరుతారు జగన్. అక్కడి నుంచి భోగాపురం మండలంలోని ఎ.రావివలసకు హెలికాప్టర్ లో వెళ్తారు. అనంతరం సీఎం జగన్.. భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు.
బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించిన తర్వాత సీఎం జగన్.. రూ.194 కోట్లతో నిర్మించబోయే తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్ట్ పెండింగ్ పనులకు, చింతపల్లి జెట్టీ నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత హెలికాప్టర్ లో బయలుదేరి.. వైజాగ్ కు చేరుకుంటారు. అక్కడ వైజాగ్ టెక్ పార్క్ కు శంకుస్థాపన చేయనున్నారు. అక్కడి నుంచి ఎంపీ ఎంవీవీ ఇంటికి వెళ్తారు. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంటికి వెళ్లిన తర్వాత ఎంపీ కుమారుడిని ఆశీర్వదిస్తారు. ఇటీవలే ఎంపీ కుమారుడి పెళ్లి జరిగింది. దీంతో కొత్త దంపతులను ఆశీర్వదించి.. అక్కడే కొంత సేపు పార్టీ నేతలతో మాట్లాడనున్నారు సీఎం జగన్. అనంతరం..
YS Jagan : సాయంత్రం తాడేపల్లికి
అక్కడి నుంచి బయలుదేరి నేరుగా తాడేపల్లికి చేరుకుంటారు. ఇక.. భోగాపురం విమానాశ్రయాన్ని సుమారు 2200 ఎకరాల్లో నిర్మించనున్నారు. జీఎంఆర్ సంస్థ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ ను రెండేళ్లలో పూర్తి చేయనున్నారు. భోగాపురంలో భూమిని సేకరించి.. భూనిర్వాసితులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్లకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చనుంది. 2025 నాటికే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాలు లాండ్ అయ్యేలా ప్రణాళికలు రచిస్తున్నారు. అలాగే.. వైజాగ్ లో అదానీ కంపెనీ పెట్టబోయే డేటా సెంటర్, ఐటీ పార్క్ ను సుమారు రూ.21 వేల కోట్లతో నిర్మిస్తున్నారు. దానికి కూడా సీఎం శంకుస్థాపన చేయనున్నారు.