శభాష్ జగన్, జనం కోసం ఎంత ఆలోచిస్తున్నాడో కొత్త సంవత్సరం మొదటి రోజునే అర్ధం అయ్యింది..!
ఏపీ ప్రజలకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. కొత్త సంవత్సరం కానుకగా.. సీఎం జగన్.. కొన్ని ఉచిత సేవలను ప్రారంభించారు. విపత్తు నిర్వహణ, అత్యవసర సేవలకు సంబంధించిన వాహనాలను సీఎం జగన్ ఈసందర్భంగా ప్రారంభించారు.
అత్యవసర సేవలకు సంబంధించిన 14 వాహనాలతో పాటు.. పోలీస్ సేవల కోసం 36 వాహనాలను ఏపీ సీఎం లాంచ్ చేశారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఈ వాహనాలను సీఎం జగన్ ప్రారంభించారు.
36 ఎమర్జెన్సీ రెస్పాన్స్ వాహనాలు, 14 డిజాస్టర్ రెస్పాన్స్ వాహనాలను పోలీస్ శాఖకు అప్పగించాం. త్వరలోనే ఇంకా మరిన్ని వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. దిశ చట్టాన్ని సమర్థంగా అమలు చేయాలంటే ఇంకా మరిన్ని ఎమర్జెన్సీ వాహనాలు అందుబాటులోకి రావాల్సి ఉంది. వీటన్నింటినీ త్వరలోనే పోలీస్ శాఖకు ఇచ్చేస్తాం.. అని సీఎం జగన్ స్పష్టం చేశారు.
ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఆ ప్రాంతానికి వెళ్లే వాహనాల కండీషన్ బాగుండాలి. ఫాస్ట్ గా ఎంత వీలైతే అంత త్వరగా అక్కడికి వెళ్లగలగాలి. అప్పుడే అక్కడి సమస్యను తొందరగా పరిష్కరించవచ్చు. అందుకే.. అగ్నిమాపక శాఖలో పాత వాహనాలకు తీసేసి.. కొత్త వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. అలాగే.. కొత్తగా తీసుకొచ్చిన ఈ వాహనాలు.. అత్యాధునిక వీడియో కెమెరాలను కలిగి ఉంటాయి. అలాగే ఇవి సెంట్రల్ కమాండ్ రూమ్ కు కనెక్ట్ అయి ఉంటాయి. దీని వల్ల వాహనాన్ని ఎక్కడున్నా ట్రాక్ చేయొచ్చు.. అని సీఎం జగన్ స్పష్టం చేశారు.