YS Jagan : జాబ్ క్యాలండర్ ఓకే.. మరి.. వైసీపీలో ఉన్న నిరుద్యోగుల సంగతి ఏంటి అని ప్రశ్నిస్తున్న ఆ నేతలు?
YS Jagan : ప్రస్తుతం ఎక్కడ చూసినా నిరుద్యోగులు కుప్పలు తెప్పలుగా ఉంటున్నారు. ఏపీలో నిరుద్యోగ యువత విపరీతంగా పెరిగిపోయింది. సీఎం వైఎస్ జగన్ పై కూడా విమర్శలు కురిపిస్తున్నారు. ఇంకెప్పుడు వేస్తారు నోటిఫికేషన్లు.. ఇంకెప్పుడు ఇస్తారు ఉద్యోగాలు.. అంటూ వైసీపీ ప్రభుత్వంపై యువత నిప్పులు చెరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్.. ఇటీవల నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ ను విడుదల చేశారు. నిజానికి.. ఆ జాబ్ క్యాలెండర్ మీద కూడా చాలా విమర్శలు వచ్చాయి. అది జాబ్ క్యాలెండర్ కాదు.. నిరుద్యోగల పాలిట శాపం అంటూ ప్రతిపక్షాలు ఆ జాబ్ క్యాలెండర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
కట్ చేస్తే.. ఇప్పుడు వైసీపీలో ఉన్న నిరుద్యోగుల కోసం.. అంటే పదవులు రాకుండా ఉన్నవాళ్ల కోసం జాబ్ క్యాలెండర్ సిద్ధం చేస్తున్నారట. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా.. పదవుల కోసం ఆతృతగా చూస్తున్నవాళ్లు కోకొల్లలు. ఎవరికి న్యాయం చేయాలి.. ఎవరికి పదవి ఇవ్వాలి.. ఎవరికి ఇవ్వకూడదు.. అనే దానిపై సీఎం జగన్ మల్లగుల్లాలు పడుతున్నారు.
YS Jagan : ఎమ్మెల్సీ పోస్టులు ఎవరికి దక్కుతాయో?
త్వరలో ఎమ్మెల్సీ పోస్టులను సీఎం జగన్ భర్తీ చేయనున్నారని తెలిసి… పదవి కోసం చూస్తున్న నేతలంతా ఇక మంతనాలు చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా విశాఖ జిల్లాలో అయితే.. బోలెడు మంది నాయకులు.. పదవుల కోసం వెయిట్ చేస్తున్నారు. గత రెండేళ్ల నుంచి వీళ్లు ఎదురు చూస్తున్నారు. అయితే.. వీళ్లలో ఎవరికి పదవులు దక్కుతాయి.. అనేదే ప్రస్తుతం పెద్ద సస్పెన్స్ గా మారింది.
విశాఖ జిల్లాలో పదవుల కోసం ఎదురు చూసే వాళ్ల లిస్ట్ చూస్తే చాంతాడంత ఉంటుంది. వీళ్లందరికీ పదవులు దక్కాలంటే మాత్రం కష్టమే. కానీ.. ఇందులో ఎవరికి దక్కుతాయి.. అనేది మాత్రం సీఎం జగన్ కే తెలియాలి. ఇందులో కొందరు వేరే పార్టీల నుంచి జంప్ అయిన వాళ్లు ఉన్నారు. వైసీపీ సీనియర్ నేతలు ఉన్నారు. ఎన్నికలకు ముందు వైసీపీలోకి వచ్చినవాళ్లు ఉన్నారు. వీళ్లలో ఎవరికి పదవులు దక్కుతాయి.. అనేదానిపై ప్రస్తుతం స్పష్టత లేదు. కాకపోతే.. సీఎం జగన్ మాత్రం ఎమ్మెల్సీ పోస్టుల భర్తీ విషయమై కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.
నిజానికి.. సీఎం జగన్.. పదవుల విషయంలో చాలా క్లారిటీతో ఉన్నారు. ఎందుకంటే.. ఆయన ముందు నుంచి కూడా పార్టీలో ప్రాధాన్యత ఉన్ననేతలకే పదవులు కట్టబెడుతున్నారు. పార్టీలో మొదటి నుంచి ఉండి.. పార్టీని గాడిలో పెట్టడంతో సహకరించిన వాళ్లకే పదవులు దక్కుతున్నాయి. టీడీపీ నుంచి పార్టీలో చేరిన వాళ్లలోనూ అందరికి కాకుండా.. సమర్థత ఉన్న నాయకులకే పదవులను ఇస్తున్నారు. ఈ విషయం ఇటీవల జరిగిన నామినేటెడ్ పోస్టుల విషయంలోనే అర్థమయింది. అందుకే.. త్వరలో భర్తీ కానున్న ఎమ్మెల్సీ పోస్టులు దక్కుతాయో.. అని అంతా టెన్షన్ గా ఎదురుచూస్తున్నారు.