“వణుకు పుట్టాలి” చాలా చాలా సీరియస్ ఐన జగన్..!
ఏపీ సీఎం జగన్ ను అభివృద్ధిలో అడ్డుకునే మొనగాడే లేడు. కానీ.. జగన్ ను అడ్డుకుంటున్న ఒకే ఒక సమస్య. హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు. ఆ దాడులను ఎవరు చేయిస్తున్నారో తెలియదు కానీ.. అది మాత్రం ఏకంగా జగన్ మెడకు చుట్టుకుంటోంది. దీంతో జగన్ కు ఏం చేయాలో తెలియక సతమతమవుతున్న పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది. ప్రతిపక్షాలైతే డైరెక్ట్ గా జగన్ నే విమర్శిస్తున్నారు. హిందువులను, హిందూ దేవాలయాలను నాశనం చేస్తారా? బతకనివ్వరా? అంటూ విమర్శిస్తున్నాయి. అందుకే జగన్ కూడా ఈ విషయంపై చాలా సీరియస్ అయ్యారు.

ap cm ys jagan serious on ap temples issue
అధికారులందరినీ పిలిచి మరీ ఒక్కొక్కరికి క్లాస్ పీకేశారు జగన్. ఆయనలో ఇప్పటి వరకు అంత ఆగ్రహాన్ని చూడలేందంటూ ఓ అధికారి చెప్పారు. అంత ఆగ్రహంతో జగన్ ఊగిపోయారట. ఇక నుంచి ఏపీలో ఒక్కటంటే ఒక్క సంఘటన కూడా జరగకూడదు. హిందూ దేవాలయాల్లో ఇప్పటి నుంచి ఎటువంటి చిన్న ఘటన జరిగినా.. ఆ ఘటనకు బాధ్యులైన వారిపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను, అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.
దేవుడితో చెలగాటమా?
దేవుడితో కావాలని కొన్ని దుష్టశక్తులు చెలగాటం ఆడుతున్నాయి. నన్ను బ్లేమ్ చేయాలని.. హిందూ దేవాలయాల మీద దాడులు చేస్తున్నారు. విగ్రహాల ధ్వంసానికి పాల్పడే వాళ్లు ఎవరైనా సరే.. ఇక తప్పించుకోలేరు. ఇంకోసారి అటువంటి పనిచేయాలంటేనే వణుకు పుట్టాలి. అలాంటి కఠిన శిక్షలను అమలు చేస్తాం.. అంటూ సీఎం జగన్ అన్నారు.