తిరుపతి ఉపఎన్నిక ముందు సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం జగన్?
ప్రస్తుతం ఏపీలో ఒకటే హాట్ టాపిక్. అదే తిరుపతి ఉపఎన్నిక. 2019 ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు ఏపీలో ఏ ఎన్నికలు జరగలేదు. ఇటీవల తిరుపతి ఎంపీ అకాల మృతి చెందడంతో తిరుపతి ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ తిరుపతి ఉపఎన్నిక కోసం సమాయత్తమవుతున్నాయి.
తిరుపతిలో 2019లో వైసీపీ నుంచి పోటీ చేసిన బల్లి దుర్గాప్రసాద్ గెలిచారు. మళ్లీ అధికార పార్టీనే తిరుపతి సీటును దక్కించుకోవడం కోసం తెగ ప్రయత్నాలు చేస్తోంది. తిరుపతి ఉపఎన్నికలో గెలిచి ఏపీ ప్రజలంతా ఇంకా వైసీపీ వైపే ఉన్నారని చాటిచెప్పాలని ప్రయత్నిస్తోంది.
అందుకే.. ఈ ఉపఎన్నికకు ముందు రాయలసీమకు ఏదో ఒక బంపర్ హామీ ఇవ్వాలని తెగ ఆలోచిస్తున్నారట. ఇప్పటికే.. సీఎం జగన్.. మూడు రాజధానులను ప్రకటించారు. రాయలసీమలో ఒక రాజధాని అని కూడా ముందే ప్రకటించడంతో.. ప్రస్తుతం రాయలసీమ వాసులు జగన్ కు ఫేవర్ గానే ఉన్నారు.
హైకోర్టును కర్నూలుకు తరలించి.. కర్నూలును న్యాయ రాజధానిగా ఏర్పాటు చేయాలని ముందే సీఎం జగన్ నిర్ణయించారు. అదేదో తిరుపతి ఉపఎన్నికకు ముందే చేస్తే బెటర్ కదా.. అటు ఉపఎన్నికలో ప్రజలు కూడా వైసీపీ ఓట్లేసే అవకాశం ఉందని.. తిరుపతి ఓటర్లను తమవైపునకు తిప్పుకోవాలంటే.. ఎన్నికకు ముందు కర్నూలుకు హైకోర్టును తరలించాలని ఏపీ సీఎం భావిస్తున్నారట.
దాని కోసం చేయాల్సిన పనులను కూడా ఇప్పటికే ప్రారంభించారట. రాష్ట్రపతి నుంచి హైకోర్టు తరలింపునకు పర్మిషన్ వస్తే.. వెంటనే కర్నూలుకు హైకోర్టును తరలించేస్తారు. ఇటీవల సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లినప్పుడు హైకోర్టు మార్పు విషయం గురించి కూడా చర్చకు వచ్చిందట. కేంద్రం కూడా ఈ విషయంపై పెద్దగా అభ్యంతరాలేమీ చెప్పలేదట. కేంద్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే.. ఇక హైకోర్టు మార్పు తథ్యం అన్నమాట. అందుకే.. అదేదో తిరుపతి ఉపఎన్నిక ముందే కానిచ్చేస్తే… తిరుపతి ఉపఎన్నికలో మరోసారి తిరుగులేని గెలుపును ఖాయం చేసుకోవచ్చని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
బీజేపీ ప్లాన్ వేరే?
అయితే.. సీఎం జగన్ వైసీపీ గెలుపు కోసం హైకోర్టును మారుస్తుంటే.. బీజేపీ కూడా తమ పార్టీ గెలుపు కోసం.. హైకోర్టు తరలింపునకు పర్మిషన్ ఇస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. తిరుపతిలో గెలుపు వైసీపీకి ఎంత ముఖ్యమో.. బీజేపీకి కూడా అంతే ముఖ్యం. అందుకే.. కేంద్రం నుంచి హైకోర్టు తరలింపు పర్మిషన్ ఇస్తే.. రాయలసీమ వాసుల్లో బీజేపీపై గౌరవం పెరుగుతుందని.. అది ఓట్ల రూపంలో వస్తుందని బీజేపీ ఆశిస్తోంది. చూద్దాం మరి.. అసలు ఏం జరగుతుందో హైకోర్టు విషయంలో?