తిరుపతి ఉపఎన్నిక : వార్నీ.. జగన్ ఇలాంటి ప్లాన్ వేశారంటే.. మళ్లీ వైసీపీదే గెలుపు?
ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా తిరుపతి ఉపఎన్నిక గురించే చర్చ. 2019 ఎన్నికల తర్వాత మళ్లీ ఏపీలో ఎన్నికలు జరగలేదు. తిరుపతి ఎంపీ అకాల మృతి చెందడంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. త్వరలో తిరుపతి ఉపఎన్నికను నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సమాయత్తమవుతుండటంతో.. ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంటోంది.
తిరుపతి ఉపఎన్నికలో ఎలాగైనా గెలవాలన్న కసిలో ఉన్నాయి ప్రధాన పార్టీలు. తిరుపతిలో మళ్లీ వైసీపీ గెలవడం కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు సీఎం జగన్. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను ప్రారంభించిన సీఎం జగన్.. చిత్తూరు జిల్లాలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఈనెల 25న పేదలకు ఇళ్ల స్థలాలను సీఎం జగన్ పంపిణీ చేయనున్నారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వనున్నారు. దాని కోసమే ఈనెల 25న సీఎం జగన్ చిత్తూరు జిల్లా పర్యటన జరగనుంది.
అయితే.. ఎక్కడ కార్యక్రమం ఏర్పాటు చేస్తారు అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే.. ఒకేసారి 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం అనేది మాత్రం మామూలు విషయం కాదు. దేశంలోనే ఇలాంటి కార్యక్రమాన్ని ఎవ్వరూ ప్రారంభించలేదు.
చంద్రబాబుకు షాకివ్వడం కోసమేనా?
సీఎం జగన్.. పేదలకు ఇళ్ల పట్టాలను ఇవ్వడానికి చిత్తూరు జిల్లానే ఎంచుకోవడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకటి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సొంత జిల్లా కావడం.. రెండు తిరుపతి ఉపఎన్నిక జరగడం.. ఒకేసారి 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి తిరుపతి ఉపఎన్నికలో గెలిచేందుకు లైన్ క్లియర్ చేసుకోవడంతో పాటు.. చంద్రబాబు సొంత ఇలాకాలో చంద్రబాబు హయాంలో ఏనాడూ పేదలకు జరగని లబ్ధి నేడు జగన్ ద్వారా జరగడం కోసం చిత్తూరు జిల్లాను వైసీపీ ప్రభుత్వం ఎంచుకున్నట్టు తెలుస్తోంది.
ఒకవేళ ఈ కార్యక్రమం సక్సెస్ అయితే.. తిరుపతిలో వైసీపీ గెలుపును ఎవ్వరూ ఆపలేరు.