YS Jagan : ఎన్‌టీఆర్ గారి మీద నాకంటే గౌరవం ఉందా మీకు.. అసంబ్లీలో టీడీపీకి వైఎస్ జగన్ క్లాస్
YS Jagan : ఏపీ అసెంబ్లీలో ఇవాళ సీఎం వైఎస్ జగన్.. దివంగత ఎన్టీఆర్ గురించి మాట్లాడారు. ఆయన్ను ఈ సందర్భంగా జగన్ స్మరించుకున్నారు. దివంగత ఎన్టీఆర్ అంటే నాకు ఎంతో గౌరవం, ఆయనను తక్కువ చేసి మాట్లాడేవారు ఎవరూ మన దేశంలో ఉండరు.. అని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో ఐదవ రోజు సందర్భంగా హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చే బిల్లుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో సీఎం జగన్ పై విధంగా స్పందించారు.
అసలు టీడీపీ సభ్యులు అనవసరంగా గొడవలు చేసి వెళ్లిపోవడం దురదృష్టకరం. ఈ చర్చలో వాళ్లు కూడా పాల్గొంటే బాగుండేది. ఎన్టీఆర్ గారంటే నాకు ఎలాంటి కోపం లేదు. చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా ఎన్టీఆర్ కు జగన్ మోహన్ రెడ్డి ఎక్కువ గౌరవం ఇస్తారు. ఎప్పుడు కూడా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భం లేదు. ఎన్టీఆర్ మీద నాకు ప్రేమ ఉంది. ఆప్యాయతే ఉంది కానీ.. ఆయన్ను అగౌరవ పరిచే కార్యక్రమం ఏనాడూ జరగదు అని సీఎం జగన్ వెల్లడించారు. చంద్రబాబు నోటి వెంట నందమూరి తారక రామారావు అనే మాట వస్తే పైన ఉన్న ఎన్టీఆర్ గారెకే నచ్చదు. నిజానికి.. నందమూరి తారక రామారావు అని పలకడం కూడా చంద్రబాబు నాయుడుకు నచ్చదు.
YS Jagan : నందమూరి తారక రామారావు అని పలకడం చంద్రబాబుకు నచ్చదు
కూతురును ఇచ్చిన అల్లుడే వెన్నుపోటు పొడవడంతో పాటు పలు పరిణామాలతో ఆయన మానసిక క్షోభకు గురయ్యారు. ఆయన ఇంకా చాలాకాలం బతికే ఉండేవారు కానీ.. వెన్నుపోటు వల్ల అకాల మరణం చెందారు. ఎప్పుడు కూడా తాము ఎన్టీఆర్ ను ఒక్క మాట అనలేదు. పాదయాత్రలో మేము ఇదివరకు ఇచ్చిన హామీ ప్రకారమే ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టాం.. అని సీఎం జగన్ ఈసందర్భంగా గుర్తు చేశారు. ఎన్టీఆర్ మీద ఎలాంటి కల్మషం లేదు. ఆయన పేరు పెట్టాలని ఎవ్వరూ అడగలేదు. కానీ.. ఆయన మీద ఉన్న గౌరవంతో ఆయన పేరు మీద జిల్లా పెట్టాం. అలాగే బాగా ఆలోచించే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం జగన్ చెప్పారు.