YS Jagan : వైెఎస్ జగన్ టార్గెట్ వీళ్లే.. ఈ టీడీపీ నేతలందరినీ ఓడించేందుకు జగన్ మాస్టర్ ప్లాన్ రెడీ
YS Jagan : రాజకీయాలు అంటేనే ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఇవాళ ఒక పార్టీలో ఉన్న నేతలు.. రేపు ఇంకో పార్టీలోకి మారుతారు. అసలు ఎప్పుడు ఏ నేత ఏ పార్టీలో ఉంటాడో అతడికే తెలియదు. రాత్రికి రాత్రే రాజకీయాలు మారిపోతుంటాయి. ఎత్తులకు పైఎత్తులు.. వ్యూహాలు.. మాస్టర్ ప్లాన్స్ ఇవన్నీ ఉంటేనే రాజకీయం అంటారు. ప్రత్యర్థ పార్టీలపై ఎంత కసిగా ఉంటే.. వాటిని ఎంతగా కుంగదీస్తే.. ఆ పార్టీ అంతగా సక్సెస్ అయినట్టు లెక్క. ఇక ఎన్నికలు వస్తే ఆ హడావుడే వేరు. 2019 ఎన్నికల్లో టీడీపీని వైసీపీ గద్దె దింపింది. అంతకుముందు 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ను టీడీపీ గద్దెదింపింది. ఇప్పుడు 2024 ఎన్నికల్లో వైసీపీని గద్దె దింపాలని టీడీపీ తెగ ఆరాటపడుతోంది. కానీ.. 2019 ఎన్నికల్లో గెలిచిన 151 సీట్లు కాదు.. ఏపీలోని అసెంబ్లీ సీట్లన్నింటినీ చేజిక్కించుకునేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు.
YS Jagan : 175 నియోజకవర్గాలకు మాస్టర్ ప్లాన్ ఫిక్స్ చేసిన జగన్
ఏపీలో ఉన్నదే 175 అసెంబ్లీ సీట్లు. ఆ నియోజకవర్గాల్లో 151 నియోజకవర్గాలను వైసీపీ గత ఎన్నికల్లో చేజిక్కించుకుంది. కేవలం 24 స్థానాల్లో మాత్రమే గెలవలేకపోయింది. ఇప్పుడు ఆ 24 స్థానాలను కూడా చేజిక్కించుకునేందుకు వైసీపీ పక్కా ప్లాన్ చేస్తోంది. దాని కోసమే సీఎం జగన్ పార్టీ నాయకులకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. 2014 ఎన్నికల్లో కేవలం ప్రతిపక్ష పార్టీగానే పోటీ చేసింది వైసీపీ. కానీ.. ఇప్పుడు ఏపీలో పలు సంక్షేమ పథకాలను ప్రారంభించింది వైసీపీ ప్రభుత్వం. ఏపీ ప్రజల కోసం ఎన్నో చేసింది. ఇప్పుడు 151 కంటే ఎక్కువ సీట్లలో గెలిపించాలి కదా అనేదే వైఎస్ జగన్ లాజిక్.
ఈ మూడేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసింది. అటువంటప్పుడు 175 స్థానాలను వైసీపీ ఎందుకు గెలవలేదు అని వైసీపీ నేతలు కూడా చెబుతున్నారు. అందుకే.. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన ఆ 24 నియోజకవర్గాల్లో సీఎం జగన్ ఫోకస్ పెంచారు. గన్నవరం, చీరాల, గుంటూరు వెస్ట్, వైజాగ్ సౌత్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలపై ఫోకస్ పెట్టారు. టీడీపీకి చెందిన ఆ ఎమ్మెల్యేలను వైసీపీ తమవైపునకు తిప్పుకుంది. జనసేన రాజోలు కూడా తమవైపే ఉంది. ఇలా.. అన్ని నియోజకవర్గాలను తమ వైపునకు తిప్పుకొని వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో గెలవాలని జగన్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. పార్టీ నేతలు ఆ ప్లాన్ ను ఆయా నియోజకవర్గాల్లో అమలు చేస్తున్నారట. చూద్దాం మరి.. జగన్ మాస్టర్ ప్లాన్ ఎలా వర్కవుట్ అవుతుందో?