YS Jagan : వైఎస్ జగన్ కు మోదీ ఫోన్…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Jagan : వైఎస్ జగన్ కు మోదీ ఫోన్…?

 Authored By jagadesh | The Telugu News | Updated on :31 May 2021,9:04 pm

YS Jagan : కేంద్రం విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ చాలా క్లారిటీతో ఉంటారు. ప్రధాని మోదీతో సీఎం జగన్.. పెద్దగా వివాదాలు అయితే పెట్టుకోరు కానీ.. ఏపీకి రావాల్సిన హామీలపై మాత్రం మోదీని నిలదీస్తారు జగన్. ఏది ఏమైనా.. ఏపీ సీఎం వైఎస్ జగన్ కు, కేంద్రంలోని పెద్దలతో మంచి రాపో ఉంది.. అని అంటుంటారు. కాకపోతే ఏపీ విషయంలో, ఏపీ హామీల విషయంలో కేంద్రానికి మాత్రం ఇప్పటికీ చిన్నచూపే అనే ఆరోపణ కూడా ఉంది. ఏది ఏమైనా.. పర్సనల్ అజెండాలు వేరుగా ఉంటాయి.. ప్రభుత్వ ఎజెండాలు వేరుగా ఉంటాయి. జగన్ కు ప్రధాని మోదీతో పర్సనల్ గా మంచి రాపో ఉంటేనే బెటర్. జగన్ కూడా అందుకే పర్సనల్ గా ఎక్కువగా మోదీతో విభేదాలు సృష్టించుకోవడం లేదు.

అయితే.. ఇటీవల సీఎం జగన్ కు పీఎంవో ఆఫీసు నుంచి ఫోన్ వచ్చిందట. అదే ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా తెగ చర్చనీయాంశమవుతోంది. ప్రధాని మోదీ ఆఫీసు నుంచి సీఎం జగన్ కు ఫోన్ రాగానే.. జగన్ టెన్షన్ పడ్డారట. ఆందోళనకు గురయ్యారట. అయితే.. సీఎం జగన్ కు ఫోన్ ఎందుకు వచ్చింది? ఆ తర్వాత జగన్ ఏం చేశారు? అనే విషయం అందరికీ తెలిసిందే. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రధాని మోదీపై సెటైర్లు వేస్తూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఆమధ్య కరోనాను నియంత్రించడం కోసం ప్రధాని మోదీ.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అప్పుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా పాల్గొన్నారు. ఆ కాన్ఫరెన్స్ తర్వాత హేమంత్ సోరెన్ ఓ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ ఎప్పుడూ తాను చెప్పేదే అందరూ వినాలనుకుంటారు కానీ.. ఎదుటి వారు చెప్పేది ఆయన వినరు.. అంటూ ట్వీట్ చేశారు.

ap cm ys jagan vs pmo office call

ap cm ys jagan vs pmo office call

YS Jagan : ఆ ట్వీట్ కు కౌంటర్ ట్వీట్ ఇవ్వాలంటూ పీఎంవో ఆఫీసు నుంచి జగన్ కు ఫోన్

అయితే.. ఆ ట్వీట్ కు బీజేపీ సీనియర్ నేతలు కానీ.. ఇతర మంత్రులు కానీ కౌంటర్ ఇవ్వొచ్చు. కానీ.. హేమంత్ సోరెన్ కు బీజేపీ నేతలతో కాకుండా.. వేరే పార్టీల, వేరే రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రితో కౌంటర్ ఇప్పించాలని ప్రధాని మోదీ భావించారట. అందకే.. పీఎంవో ఆఫీసు నుంచి జగన్ కు ఫోన్ వచ్చిందట. హేమంత్ ట్వీట్ కు కౌంటర్ ఇవ్వాలంటూ ప్రధాని మోదీ.. జగన్ ను ఆదేశించారట. దీంతో చేసేది లేక.. సీఎం జగన్.. హేమంత్ సోరెన్ కు కౌంటర్ ట్వీట్ ఇచ్చారు. అయితే.. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే.. ఎన్నో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉండగా.. ప్రధాని మోదీ.. జగన్ నే ఎందుకు ఎంచుకున్నారు అనేదే ప్రస్తుతం పెద్ద ప్రశ్న. ఏది ఏమైనా.. సీఎం జగన్ మీద.. ప్రధాని మోదీకి బాగానే నమ్మకం ఉంది.. వీళ్ల మధ్య ఉన్న బంధం.. మామూల్ది కాదు.. చాలా దృఢమైనది అంటూ రాజకీయ విశ్లేషకులు కామెంట్లు చేస్తున్నారు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది