YS Jagan : వైఎస్ జగన్, విజయసాయిరెడ్డి మధ్య గ్యాప్…? కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు?
YS Jagan : వైఎస్సార్సీపీ పార్టీలో కీలకంగా ఉన్న నేత విజయసాయిరెడ్డి. పార్టీ అధికారంలోకి రాకముందు అయితే.. పార్టీ వ్యవహారాలు అన్నింటినీ తానే చూసుకున్నారు. 2014 నుంచి 2019 ఎన్నికల వరకు పార్టీలో కీలకంగా వ్యవహరించిన నేత ఆయన. వైఎస్ జగన్ తర్వాత.. ఇక ఆయనే.. అన్నంత రేంజ్ లో ఆయన పార్టీలో కీలకంగా వ్యవహరించారు. 2019 ఎన్నికలకు.. రాజకీయ వ్యూహకర్త.. ప్రశాంత్ కిషోర్ ను.. వైఎస్ జగన్ ను పరిచయం చేయించి.. 2019 ఎన్నికల్లో తమ పార్టీ కోసం పనిచేయించింది కూడా విజయసాయిరెడ్డినే. ఎన్నికల తర్వాత పార్టీ గెలిచిన తర్వాత కూడా ఆయన ఆధిపత్యమే పార్టీలో కొనసాగింది.
మొన్నటి వరకు కూడా పార్టీలో, ప్రభుత్వంలో విజయసాయిరెడ్డి హవా నడిచింది. కానీ.. ఎప్పుడూ పరిస్థితులు ఒకేలా ఉండవు కదా. ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు కూడా అవుతుంటాయి. తాజాగా అదే జరిగింది.. ప్రస్తుతం విజయసాయిరెడ్డి మాట ఎక్కడా చెల్లుబాటు కావడం లేదట. అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో ఎక్కడా ఆయనకు చుక్కెదురు అవుతోందట. అయితే.. దానికి కారణాలు కూడా లేకపోలేవు.
YS Jagan : విశాఖలో జరిగిన ఘటన వల్లనే విజయసాయిరెడ్డిని జగన్ పక్కన పెట్టారా?
అయితే.. ఇటీవల విశాఖలో విజయసాయిరెడ్డి కాస్త ఓవర్ యాక్షన్ చేశారనే వార్తలు గుప్పుమంటున్నారు. వైసీపీలోనూ ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. తనకంటూ ఓ వర్గం కూడా ఉంది విజయసాయిరెడ్డికి. ఆ వర్గం ద్వారా.. విశాఖ ఏరియాలో ఏ పని జరగాలన్నా.. విజయసాయిరెడ్డి కనుసన్నల్లోనే జరగాలి.. అనే టాక్ బాగా వినిపించింది. అయితే.. ఇది కొందరు వైసీపీ నేతలకు గిట్టలేదట. దీంతో వెంటనే ఈ విషయాన్ని సీఎం వైఎస్ జగన్ చెవిలో పడేశారట.
YS Jagan : ఉత్తరాంధ్ర సీఎంను నేనే?
అంతే కాదు.. ఉత్తరాంధ్రకు నేనే సీఎం.. అంటూ విజయసాయిరెడ్డి ప్రచారం చేసుకుంటున్నారని.. తన వర్గంతో విశాఖ ప్రాంతంలో ఎన్నో ఆగడాలను సృష్టిస్తున్నారనే విషయం సీఎం వైఎస్ జగన్ కు చేరిందట. అలాగే.. ఇటీవల విజయసాయిరెడ్డి పుట్టిన రోజు వేడుకలు జరిగినప్పుడు కూడా విశాఖ మొత్తం మీద ఎక్కడ చూసినా విజయసాయిరెడ్డి హోర్డింగ్స్ ను ఏర్పాటు చేశారు. అయితే.. ఆ హోర్డింగ్స్ అన్నింటినీ తొలగించాలని.. అధిష్ఠానం నుంచి తర్వాత ఆదేశాలు వచ్చాయి. దీంతో వెంటనే ఆ హోర్డింగ్స్ ను తొలగించారు. పార్టీ నేతలు హోర్డింగ్స్ పై సీఎం వైఎస్ జగన్ కు ఫిర్యాదు చేశారట. దీంతో సీఎం జగన్ వాటిని వెంటనే తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేశారట. ఇలా.. విజయసాయిరెడ్డి తన ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తుండటం వల్లనే సీఎం వైఎస్ జగన్.. పార్టీలో, ప్రభుత్వంలో తనకు ప్రాధాన్యత తగ్గించారట. ఇప్పుడు తన మాట ఎక్కడా చెల్లుబాటు అవ్వడం లేదట. దీని వల్లనే ఇద్దరి మధ్య కూడా గ్యాప్ వచ్చిందట. అలాగే.. విజయసాయిరెడ్డి ఏ పని చెప్పినా.. అది అస్సలు వెంటనే అమలు చేయకూడదని.. ముందు నా దృష్టికి తీసుకురావాలి.. అంటూ సీఎం జగన్.. అధికారులకు కూడా ఆర్డర్ వేశారట. దీంతో విజయసాయిరెడ్డి కూడా సీఎం జగన్ తో అంటీముట్టనట్టుగా ఉంటున్నారని తెలుస్తోంది.