Ys jagan : ఈ మూడు జిల్లాలతో వైఎస్ జగన్‌కు తిప్పలు తప్పదా…?
Ys jagan రానున్న ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ Andhra pradesh లో ఇప్పటికే అన్ని పార్టీలూ సిద్ధమయ్యాయి. ఎన్నికలకు మూడేళ్లు ఉండగానే ప్రజల మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. అధికార పార్టీ వైసీపీ Ysrcp అధినేత వైఎస్ జగన్ Ys jagan సంక్షేమ పథకాలతో తనకు ప్రత్యేక ఓటు బ్యాంకును ఏర్పరుచుకుంటున్నారు. మరోవైపు చంద్రబాబు కూడా ప్రజల మధ్యకు వెళ్లి ప్రభుత్వ వ్యతిరేకతను కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో గతంలో మాదిరి వన్ సైడ్ విజయం సాధించాలన్నది వైఎస్.జగన్ ప్రయత్నం. కానీ ఈసారి మూడు జిల్లాలు మాత్రం సీఎం జగన్ Ys jagan కు ఇబ్బంది పెట్టేవిగా ఉన్నాయి. ఇటీవల వైసీపీ జరిపించిన అంతర్గత సర్వేలోనూ ఈ మూడు జిల్లాల్లో పరిస్థితి బాగా లేదని నివేదిక అందింది. ప్రధానంగా కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జగన్మోహన్ రెడ్డి Ys jagan కి కొంత వ్యతిరేకత కనపడుతుందని తేలింది. ఇందుకు ప్రధాన కారణం రాజధాని అమరావతిని తరలించడమేనని, ఆ నిర్ణయం వల్లనే ఇక్కడ వైసీపీకి మైనస్ గా మారిందని టాక్ వినిపిస్తోంది.
Ys jagan అసంతృప్తిలో జిల్లాల ప్రజలు
అమరావతి రాజధాని నిర్మాణ పనులు నిలిపివేయడం, మూడు రాజధానుల ఏర్పాటుకు ముందుకు వెళ్లడంతో ఈ మూడు జిల్లాల్లో భూముల ధరలు పూర్తిగా పడిపోయాయి. గతంలో అమరావతిని రాజధానిగా ప్రకటించిన వెంటనే గుంటూరు నుంచి ఏలూరు వరకూ భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో కొందరు తమ భూములను విక్రయించగా, మరికొందరు మాత్రం ఇంకా ధర పెరుగుతుందని అలాగే ఉంచారు. కానీ రాజధాని తరలింపుతో భూముల ధరల పడిపోయి ఇక్కడ ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. దీనికి తోడు ఇక్కడ వ్యాపారాలు కూడా బాగా దెబ్బతిన్నాయి. ఉపాధి అవకాశాలు కరువయ్యాయి. టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించడంతో ఈ మూడు జిల్లాల ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే వైసీపీ సర్కార్ వచ్చినప్పటి నుంచి మూడు రాజధానులంటూ హడావుడి చేయడంతో, ఇక్కడ భూముల ధరలు, ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి. ముఖ్యంగా అమరావతిలో సాగుతోన్న రైతు ఉద్యమం వైసీపీపై నెగటివ్ ప్రభావం చూపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు.
Ys jagan స్థానికం వర్సెస్ సార్వత్రికం
అయితే స్థానిక సమరంలో అందుకు భిన్నమైన రిజల్టు వచ్చింది. దీంతో స్థానికంలో గెలిచి, జోష్ తెచ్చుకుందామనుకున్న టీడీపీ సైతం డీలా పడింది. అయితే ఈ మూడు జిల్లాల్లో గెలుపుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ Ys jagan ప్రత్యేక కసరత్తు చేశారని, అందుకే గెలుపు సాధ్యమైందని కేడర్ చెబుతోంది. ఎప్పుడైతే, స్థానికంలో వైసీపీ గెలుపొందిందో.. టీడీపీకి చుక్కెదురైనట్లేనని వైసీపీ శ్రేణులు ప్రచారం చేశాయి. అమరావతిలో భూముల కొనుగోలులో గోల్ మాల్ జరిగిందని, అందుకే ప్రజలు తమకు పట్టం కట్టారని తెగ చెప్పుకున్నాయి. దీంతో టీడీపీ ఏం చేయాలో తెలీని దుస్థితిలో పడింది. అయితే వచ్చే ఎన్నికల్లో మాత్రం వైసీపీ Ysrcp కి ఈ మూడు జిల్లాలు దెబ్బేస్తాయన్న టాక్ బలంగా వినపడుతోంది. దీంతో ఈ మూడు జిల్లాలపై రానున్న కాలంలో వైఎస్. జగన్ ప్రత్యేక శ్రద్ధ పెడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇది సార్వత్రికంలో ఏమేరకు కలిసివస్తుందోనని కేడర్ లో తెచ చర్చజరుగుతోంది. మరి స్థానికంలో గెలుపులా .. సార్వత్రికంలోనూ వైసీపీ హవా నడుస్తుందో లేదో వేచి చూడాల్సిందే.
ఇది కూడా చదవండి ==> చంద్రబాబుకు తలనొప్పిగా మారిన ఆ ఒక్కడు..?
ఇది కూడా చదవండి ==> ఆ సీనియర్ మంత్రికి సీఎం వైఎస్ జగన్ చెక్.. మంత్రివర్గ విస్తరణలో ఆయన ఔట్..?
ఇది కూడా చదవండి ==> వీళ్లు అటా.. ఇటా.. చంద్రబాబుకు దమ్కీ ఇచ్చి.. వైసీపీలో ఈ నలుగురు నేతలు చేరినట్టేనా?