
Congress
AP Congress ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మారనున్నారా? త్వరలోనే కాంగ్రెస్ పార్టీ AP Congress ని గాడిలో పెట్టనున్నారా? ఈ క్రమం లో మార్పులు, చేర్పుల దిశగా కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే దృష్టి పెట్టిందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. రెండు రోజుల కిందట కేంద్రంలోని కాంగ్రెస్ అధిష్టానం.. ఏపీ రాజకీయాలపై ఆరాతీసింది. ఇక్కడ ఉన్న పరిస్థితిని అంచనా వేసింది. వచ్చే ఎన్నికల వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగితే కష్టమేనని తేల్చింది. ఈ క్రమంలోనే మార్పు దిశగా అడుగులు తప్పవని.. రాష్ట్ర నేతలకు సూచించింది.
AP Congress Chief Maybe Nallari kiran kumar
ఈ క్రమంలోనే కాంగ్రెస్ AP Congress సీనియర్ నాయకుడు, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్.. ఊమెన్ చాందీ అత్యంత రహస్యంగా నాయకులతో భేటీ అయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న చీఫ్ శైలజానాథ్ సహా.. పలువురు నేతలతో హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో చాందీ.. పార్టీ అధిష్టానం మనసులో మాటను కుండబద్దలు కొట్టారు. పార్టీ చీఫ్‌ను మార్చాలని.. అధిష్టానం నిర్ణయించిందన్న చాందీ.. పదవులను త్యాగం చేసేందుకు ఎప్పుడైనా రెడీగా ఉండాలని మానసికంగా.. వారిని సిద్ధం చేశారు. దీంతో ఇక, పీసీసీ చీఫ్ పదవికి కొత్త నేతను ఎంచుకునేందుకు రెడీ అయిన విషయం.. కాంగ్రెస్ నేతల మధ్య రహస్య మంతనాల్లో చర్చకు వస్తోంది.
AP Congress Chief Maybe Nallari kiran kumar
అయితే.. తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగా.. ఇక్కడ ఆ పదవి కోసం.. కొట్టుకునేవారు.. కుమ్ముకునేవారు ఎవరూ లేకపోవడం అధిష్టానానికి ఒకింత తలనొప్పి తగ్గించిందనే చెప్పాలి. అయితే.. ఎవరిని ఎన్నుకుంటే.. పార్టీని లోపేతం చేస్తారనే వ్యాఖ్యలు, విశ్లేషణలు కాంగ్రెస్ సీనియర్ల నుంచి వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీ ఉన్న పరిస్థితిలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి పగ్గాలు అప్పగిస్తే.. బెటర్ అనే మాట వినిపిస్తోంది. ఇక, పార్టీకి దూరంగా ఉన్న రఘువీరారెడ్డిని తిరిగి చేర్చుకుని.. ఆయనకే మరోసారి పగ్గాలు ఇచ్చేందుకు కూడా అధిష్టానం ప్రయత్నాలు చేస్తోందని కొందరు చెబుతున్నారు.
ఇదిలావుంటే.. కేంద్ర మాజీ మంత్రి.. పళ్లంరాజు.. ఎప్పటి నుంచో పీసీసీ పదవిపై ఆశలు పెట్టుకున్నారని.. ఇంకొందరు అంటున్నారు. అయితే.. ఎక్కువ మంది మాత్రం మాజీ సీఎం కిరణ్ కుమార్‌రెడ్డికే ఈ సారి పగ్గాలు దక్కుతాయని.. చెబుతున్నారు. ఇదే విషయం చాందీ భేటీలోనూ చర్చకు వచ్చినట్టు తెలిసింది. మొత్తానికి రాష్ట్ర విభజనకు ముందు.. యాక్టివ్‌గా ఉన్న కిరణ్.. కుమార్ ఇప్పుడు కనుక పదవి ఇస్తే.. ఏవిధంగా పార్టీని లైన్‌లో పెడతారో చూడాలి.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.