YS Jagan : జగన్ మీద పడి ఏడ్చే వారికి దిమ్మ తిరిగే న్యూస్
YS Jagan : ఏపీ ప్రభుత్వ పాలన గురించి విమర్శించే వారికి ఇదొక చెంపపెట్టు అని చెప్పుకోవాలి. అసలు సీఎంగా జగన్ ఏం చేస్తున్నారు అంటూ తెగ ఏడుస్తున్నారు కదా ప్రతిపక్షాలు. అసలు ఏపీకి ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయో.. ఎంత మంది పారిశ్రామికవేత్తలు ఏపీకి వచ్చి పెట్టుబడులు పెడుతున్నారో తెలిస్తే షాక్ అవుతారు. అసలు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా తీసుకురాని పెట్టుబడులను ఏపీకి సీఎం జగన్ తీసుకొస్తున్నారు.
వైజాగ్ లో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 లో సీఎం జగన్ ప్రసంగించి.. ఏపీకి వస్తున్న పెట్టుబడుల గురించి వివరించిన విషయం తెలిసిందే. ఏపీకి రూ.11.58 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. కొన్ని లక్షల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నట్టు కూడా ఆయన తెలిపారు. ఏపీలో ఉన్న నీటి వనరుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
YS Jagan: 974 కిమీల మేర సుదీర్ఘ తీర ప్రాంతం ఏపీ సొంతం
ఏపీలో ఉన్న వనరులు మరే రాష్ట్రంలో లేవు. అందుకే సులువైన పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తున్నారు. పారిశ్రామిక కారిడార్స్ కూడా ఏపీలో వస్తున్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లోనూ ఏపీనే నెంబర్ వన్. సుమారు రూ.12 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం అంటే మామూలు విషయం కాదు. అందుకే.. త్వరలోనే విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా మార్చి పారిశ్రామిక విధానాన్నే తీసుకొస్తున్నట్టు సీఎం జగన్ స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ గ్రీన్, హైడ్రో ఎనర్జీలలో ఏపీది కీలక పాత్ర అని సీఎం జగన్ స్పష్టం చేశారు.