Ap : ఇలాంటి క‌ఠిన ‘ప‌రీక్ష‌లు’ అవ‌స‌ర‌మా జ‌గ‌న‌న్న‌..!

0
Advertisement

Ap : టెన్త్, ఇంటర్ పరీక్షల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనవసరమైన పట్టుదలకు పోతోందనిపిస్తోంది. తద్వారా అధికార పార్టీ వైఎస్సార్సీ పొలిటికల్ గా రిమార్కులు పొందుతున్నట్లు కనిపిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశం మొత్తం ఒక దారిన పోతుంటే ఏపీ మాత్రం మరోదారిలో పోతోందనే టాక్ వినిపిస్తోంది. దాదాపు అన్ని రాష్ట్రాలూ ఈ ఎగ్జామ్స్ ని క్యాన్సిల్ చేయటమో, పోస్ట్ పోన్ చేయటమో చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం వెనక్కి తగ్గట్లేదు. ఇలా మొండిగా వ్యవహరిచటం వల్ల మంచి పేరు కన్నా చెడ్డ పేరునే ఎక్కువ మూటగట్టుకుంటోందని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. మరీ ముఖ్యంగా విద్యార్థుల, వాళ్ల తల్లిదండ్రుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా ప్రకటనలు చేస్తుండటం గందరగోళానికి దారితీస్తోంది.

అయినా తప్పదు..

పదో తరగతి పరీక్షల్లో వచ్చే మార్కులను ఫ్యూచర్ లో అన్ని చోట్లా లెక్కలోకి తీసుకుంటారు. అందుకే ఎగ్జామ్స్ పెట్టకుండా కేవలం పాస్ అని రాసివ్వలేమని ప్రభుత్వం చెబుతోంది. ఇది స్టూడెంట్స్ భవిష్యత్తుకే మంచిదని అంటోంది. కానీ ఆకాశంలోని మబ్బులను చూసి బిందెలోని నీళ్లను పారబోసుకోకూడదు కదా. అప్పుడెప్పుడో అత్యుత్తమ అవకాశాలు చేజిక్కుతాయనే ఆశతో ఇప్పుడు పిల్లల ప్రాణాలను పణంగా పెట్టకూడదు కదా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయినా దేశం మొత్తం కరోనా కరోనా అంటూ ఓ రేంజ్ లో భయపడుతుంటే ఆంధ్రప్రదేశ్ సర్కారేంటి లైట్ తీసుకుంటోందని పలువురు ప్రశ్నిస్తున్నారు. వరుస ఎన్నికల్లో విజయాలను నమోదు చేస్తున్న వైఎస్సార్సీపీ ఆ ప్రజా తీర్పులను అన్నింటికీ అప్లై చేస్తోందా అని ఎద్దేవా చేస్తున్నారు.

ap governament about tenth inter exams
ap governament about tenth inter exams

ప్రతిపక్షాలకు.. పని కల్పించటం..: Ap

సహజంగా ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేసినా మెచ్చుకోవు. ఏదో ఒక వంక పెడుతూనే ఉంటాయి. అఫ్ కోర్స్ ఏ గవర్నమెంటైనా సెంట్ పర్సెంట్ ప్రజలకు న్యాయం చేయజాలదు. అందుకే అపొజిషన్ పార్టీలు ఆ మాత్రమైనా బతికి బట్ట కట్టకలుగుతున్నాయి. ఏపీలోని విపక్షాలు కూడా అంతే. ముఖ్యమంత్రి జగన్ ఏ కార్యక్రమాన్ని మొదలు పెట్టినా బోడి గుండుకి, బట్ట తలకి ముడిపట్టి మాట్లాడతాయి. ప్రజల్లో లేని అలాంటి పార్టీలకు వైఎస్సార్సీపీ సర్కారు స్వీయ తప్పిదాలతో పని కల్పిస్తోందని, విమర్శలను కొనితెచ్చుకుంటోందని పబ్లిక్ అనుకుంటున్నారు. రాజకీయ పార్టీలు గానీ ప్రభుత్వాలు గానీ ప్రజామోదం పొందలేని ఆలోచనలను చేయకూడదు. చేతులు కాలాక ఆకులు పట్టుకోకూడదు. కాబట్టి ఇప్పటికైనా సీఎం జగన్ సారు టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ గురించి పునరాలోస్తే బాగుంటుందని సూచిస్తున్నారు.

Advertisement