YCP : అమ్మ ఒడి పథకంపై విపక్షాల విమర్శలకు ఇదే వైకాపా సమాధానం
YCP : వైకాపా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మరో సంక్షేమ పథకం అమ్మ ఒడి. పేద విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు అద్బుతమైన పథకం ఇది అంటూ ఎన్నో రాష్ట్రాలకు చెందిన ప్రజా ప్రతినిధులు మరియు ఉన్నతాధికారులు సైతం అభినందనలు దక్కించుకుంది. పక్క రాష్ట్రాల్లో కూడా అమలుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇలాంటి పథకంపై విపక్ష పార్టీలు నోటికి వచ్చినట్లుగా విమర్శలు చేస్తూ పథకం యొక్క ఉద్దేశ్యం తప్పుదోవ పట్టే విధంగా విమర్శలు గుప్పిస్తున్నారు.అమ్మ ఒడి పథకం కింద విద్యార్థిని లేదా విధ్యార్థి తల్లి కి ప్రతి ఏడాదికి 15 వేల రూపాయల ఆర్థిక సాయం అందుతుంది.
పిల్లలు ఎంత వరకు చదువుకోవాలంటే అంత వరకు చదువుకునే విధంగా పిల్లల తల్లిదండ్రులకు ఒక మేనమామగా సీఎం జగన్ మోహన్ రెడ్డి నగదును ఇస్తున్నాడు. మొదట ఈ మొత్తం ను పది వేల రూపాయలు అనుకున్నారు. అయితే స్కూల్ లో ఉన్న మౌళిక వసతులు మరియు ఇతరం అభివృద్ది కోసం అన్నట్లుగా అదనపు మొత్తంను విడుదల చేస్తున్నారు.గత ఏడాది ప్రభుత్వ స్కూల్స్ లో ఉన్న మరుగుదొడ్ల మెయింటెన్స్ కోసం ప్రతి విద్యార్థి నుండి వెయ్యి తగ్గించారు. ఇప్పుడు ఆ మొత్తం సరిపోని కారణంగా రెండు వేల రూపాయలను కట్ చేస్తున్నాడు.
13 వేల రూపాయలు ఇస్తున్న విషయం పట్టించుకోకుండా ఇప్పుడు అంతా కూడా కేవలం ఆ రెండు వేల రూపాయలను కట్ చేస్తున్నాడు అంటూ విమర్శలతో దుమ్మెత్తి పోతున్నారు. పిల్లల ఆరోగ్యం మరియు వారి యొక్క వికాసం కోసం రెండు వేల రూపాయలను వారి తల్లిదండ్రులు ఖర్చు చేసే బదులు ప్రభుత్వం వారి యొక్క డబ్బును ఖర్చు చేయడం తప్పా అంటూ వైకాపా నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో తెలుగు దేశం పార్టీ తో పాటు విపక్ష పార్టీల నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వ ఆర్థిక అవసరాల కోసం ఆ డబ్బు ను వినియోగించడం లేదని వైకాపా సమాధానం చెప్పింది.