Ap Govt : ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక వారు చెప్పిన ఆరు గ్యారెంటీలు ఒక్కొక్కటిగా అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో పండగల సీజన్ నడుస్తుండటంతో రేట్లు పెరగడంతోపాటు డిమాండ్ కూడా పెరిగింది. ఈ క్రమంలోనే వంట నూనెలు సలసల కాగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే పండగల వేళ.. నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం.. ఏపీ వాసులకు భారీ ఊరట కల్పించింది. పెరిగిన ధరల నుంచి ప్రజలను కాపాడేందుకు తక్కువ ధరకే వంట నూనెలను అందించాలని నిర్ణయం తీసుకుంది. మరోవైపు కొత్త రేషన్ కార్డ్‌లు కూడా అందించే ప్లాన్ చేస్తుంది. కొత్త కార్డుల మంజూరుకు అర్హతల ను ఖరారు చేయాలని అధికారులకు సూచించింది.
వైసీపీ రంగులతో ఉన్న పాత రేషన్ కార్డులను రద్దు చేయనుంది. వాటి స్థానంలో కొత్త కార్డుల మంజూరు పైన అధికారులు కసరత్తు చేస్తున్నారు. అధికారులు పలు డిజైన్లు పరిశీలిస్తున్నారు. లేత పసుపు రంగుతో, రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నం ముద్రించిన కార్డుల నమూనాను అధికారులు ప్రభుత్వ ఆమోదం కోసం ప్రతిపాదించారు. దాంతోపాటు మరికొన్ని నమూనాలను కూడా ప్రభుత్వ పరిశీలనకు పంపించారు.స్మార్ట్ కార్డుల జారీ అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టుగా టాక్ నడుస్తుంది.. స్మార్ట్ రేషన్ కార్డుల వల్ల వలస కార్మికులు, కుటుంబాలు దేశంలో ఎక్కడైనా రేషన్ సరుకులు తీసుకునే అవకాశం ఉంటుంది.
ఇక రాష్ట్రంలో 1,36,420 మంది జాతీయ ఆహార భద్రతా కార్డుదారులు, మరో 17,941 మంది అంత్యోదయ అన్న యోజన కార్డుదారులు కలిపి మొత్తం 1,44,361 కార్డుదారులు 6 నెలలుగా రేషన్ తీసుకోవడం లేదు. అయితే రేషన్ కార్డ్‌లని తీసుకోని వారు ఉంటే వాటిని క్యాన్సిల్ చేసి కొత్త రేషన్ కార్డులిస్తే 2,10,823 మందికి లబ్ధి చేకూరుతుందని అధికారులు సూచించారు. కొత్తగా పెళ్లైన జంటలకు కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే నూతన దంపతులకు కొత్త కార్డులు ఇవ్వాలంటే ముందుగా వారి కుటుంబ రేషన్ కార్డుల నుంచి పేర్లు తొలగించాల్సి ఉంటుంది. వైకాపా రంగులతో ఉన్న రేషన్ కార్డ్‌లపైనే మొన్నటి వరకు పంపిణీ చేయగా, దానిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.