Ap Govt : పాత కార్డ్‌లకి బైబై.. కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌తో ఇచ్చేలా అధికారుల ప్లాన్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ap Govt : పాత కార్డ్‌లకి బైబై.. కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌తో ఇచ్చేలా అధికారుల ప్లాన్..!

Ap Govt : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక వారు చెప్పిన ఆరు గ్యారెంటీలు ఒక్కొక్క‌టిగా అమ‌లు చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో పండగల సీజన్ నడుస్తుండటంతో రేట్లు పెరగడంతోపాటు డిమాండ్ కూడా పెరిగింది. ఈ క్రమంలోనే వంట నూనెలు సలసల కాగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే పండగల వేళ.. నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం.. ఏపీ వాసులకు భారీ ఊరట కల్పించింది. పెరిగిన ధరల నుంచి ప్రజలను కాపాడేందుకు తక్కువ ధరకే వంట […]

 Authored By ramu | The Telugu News | Updated on :11 October 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Ap Govt : పాత కార్డ్‌లకి బైబై.. కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌తో ఇచ్చేలా అధికారుల ప్లాన్..!

Ap Govt : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక వారు చెప్పిన ఆరు గ్యారెంటీలు ఒక్కొక్క‌టిగా అమ‌లు చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో పండగల సీజన్ నడుస్తుండటంతో రేట్లు పెరగడంతోపాటు డిమాండ్ కూడా పెరిగింది. ఈ క్రమంలోనే వంట నూనెలు సలసల కాగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే పండగల వేళ.. నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం.. ఏపీ వాసులకు భారీ ఊరట కల్పించింది. పెరిగిన ధరల నుంచి ప్రజలను కాపాడేందుకు తక్కువ ధరకే వంట నూనెలను అందించాలని నిర్ణయం తీసుకుంది. మ‌రోవైపు కొత్త రేష‌న్ కార్డ్‌లు కూడా అందించే ప్లాన్ చేస్తుంది. కొత్త కార్డుల మంజూరుకు అర్హతల ను ఖరారు చేయాలని అధికారులకు సూచించింది.

Ap Govt కొత్త కార్డులు..

వైసీపీ రంగులతో ఉన్న పాత రేషన్ కార్డులను రద్దు చేయనుంది. వాటి స్థానంలో కొత్త కార్డుల మంజూరు పైన అధికారులు కసరత్తు చేస్తున్నారు. అధికారులు పలు డిజైన్లు పరిశీలిస్తున్నారు. లేత పసుపు రంగుతో, రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నం ముద్రించిన కార్డుల నమూనాను అధికారులు ప్రభుత్వ ఆమోదం కోసం ప్రతిపాదించారు. దాంతోపాటు మరికొన్ని నమూనాలను కూడా ప్రభుత్వ పరిశీలనకు పంపించారు.స్మార్ట్‌ కార్డుల జారీ అంశాన్ని కూడా పరిశీలిస్తున్న‌ట్టుగా టాక్ న‌డుస్తుంది.. స్మార్ట్‌ రేషన్‌ కార్డుల వల్ల వలస కార్మికులు, కుటుంబాలు దేశంలో ఎక్కడైనా రేషన్‌ సరుకులు తీసుకునే అవకాశం ఉంటుంది.

Ap Govt పాత కార్డ్‌లకి బైబై కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌తో ఇచ్చేలా అధికారుల ప్లాన్

Ap Govt : పాత కార్డ్‌లకి బైబై.. కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌తో ఇచ్చేలా అధికారుల ప్లాన్..!

ఇక రాష్ట్రంలో 1,36,420 మంది జాతీయ ఆహార భద్రతా కార్డుదారులు, మరో 17,941 మంది అంత్యోదయ అన్న యోజన కార్డుదారులు కలిపి మొత్తం 1,44,361 కార్డుదారులు 6 నెలలుగా రేషన్‌ తీసుకోవడం లేదు. అయితే రేష‌న్ కార్డ్‌ల‌ని తీసుకోని వారు ఉంటే వాటిని క్యాన్సిల్ చేసి కొత్త రేష‌న్ కార్డులిస్తే 2,10,823 మందికి లబ్ధి చేకూరుతుందని అధికారులు సూచించారు. కొత్తగా పెళ్లైన జంటలకు కొత్త రేషన్‌ కార్డులను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే నూతన దంపతులకు కొత్త కార్డులు ఇవ్వాలంటే ముందుగా వారి కుటుంబ రేషన్‌ కార్డుల నుంచి పేర్లు తొలగించాల్సి ఉంటుంది. వైకాపా రంగుల‌తో ఉన్న రేష‌న్ కార్డ్‌ల‌పైనే మొన్న‌టి వ‌ర‌కు పంపిణీ చేయ‌గా, దానిపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది