Ap Govt : గుడ్‌ న్యూస్‌.. కరోనా ఆర్టీపీసీఆర్‌ పరీక్ష ధరను భారీగా తగ్గించిన ఏపీ ప్రభుత్వం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ap Govt : గుడ్‌ న్యూస్‌.. కరోనా ఆర్టీపీసీఆర్‌ పరీక్ష ధరను భారీగా తగ్గించిన ఏపీ ప్రభుత్వం

 Authored By aruna | The Telugu News | Updated on :19 January 2022,10:30 am

Ap Govt  : దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఓ వైపు కరోనా.. మరో వైపు ఒమిక్రాన్‌ వేరియంట్లతో కేసుల సంఖ్య లక్షల్లో నమోదవుతోంది. గత కొద్ది రోజులుగా కేసుల సంఖ్య మూడు లక్షలకు చేరువగా వెళ్తోన్న వేళ ఏపీ ప్రభుత్వం ఓ మంచి నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో కరోనాల ఆర్టీపీసీఆర్‌ (RT-PCR) పరీక్ష ధరను తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఐసీఎంఆర్‌ (ICMR) గుర్తింపు కలిగిన ఎన్‌ఏబీఎల్‌ ప్రైవేట్‌ ల్యాబ్‌లలో ఆర్టీపీసీఆర్‌ -RTPCR పరీక్షల ధరను రూ.350గా నిర్ణయిస్తూ ఉత్తర్వులు ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. ప్రస్తుతం కరోనా ఆర్టీపీసీఆర్‌ పరీక్ష ధర.. రూ.499 ఉండగా.. ఇప్పుడా ఆ పరీక్షను కేవలం రూ.350కే చేయనున్నారు.

ap govt decreases rtpcr test rate from today

ap govt decreases rtpcr test rate from today

నేటి నుంచి రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులలో ఆర్టీపీసీఆర్‌ -RTPCR పరీక్షలను.. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే జరపాలని ఆస్పత్రులు, ల్యాబ్‌లకు ఆదేశాలు జారీ చేసింది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది