Nara Lokesh : పాదయాత్ర చెయ్యడానికి దిగిన నారా లోకేష్ కి మొట్టమొదటి రోజే నెత్తిన పిడుగు లాంటి వార్త !
Nara Lokesh : రంగం సిద్ధమైంది. టీడీపీ యువనేత నారా లోకేశ్ పాదయాత్రకు టైమ్ కూడా దగ్గర పడుతోంది. ఈ నెల 27 నుంచి నారా లోకేశ్ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభం అవుతుంది. యువగళం పేరుతో పాదయాత్రను ప్రారంభించబోతున్నారు. కుప్పంలో బహిరంగ సభ కూడా ఉంటుంది. అయితే.. బహిరంగ సభకు పోలీసులు కొన్ని ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. కొన్ని షరతులతో కూడిన పర్మిషన్ ను పోలీసులు ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో యాత్ర ఉన్నన్ని రోజులు ఈ నియమ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు.
పాదయాత్ర కోసం 15 షరతులను, కుప్పంలో జరిగే బహిరంగ సభకు 14 షరతులను విధించారు. ఒకవేళ వీటిని ఉల్లంఘిస్తే మాత్రం పాదయాత్రను రద్దు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. దీన్ని బట్టి చూస్తే కావాలనే నారా లోకేశ్ ను పాదయాత్ర విషయంలో టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే.. దీనిపై టీడీపీ.. ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది. దీనిపై జగన్ ప్రభుత్వం తాజాగా స్పందించింది. గతంలో చాలామంది పాదయాత్రలు చేసినప్పుడు ఉన్న పలు మార్గదర్శకాలను ప్రభుత్వం గుర్తు చేసింది. అప్పుడు ఏ మార్గదర్శకాలు అమలు చేశామో… లోకేశ్ విషయంలోనూ అవే మార్గదర్శకాలను అమలు చేశామని ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
Nara Lokesh : సుప్రీం తీర్పును గుర్తు చేసిన ఏపీ ప్రభుత్వం
2017 లో ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పాదయాత్ర కోసం ప్రభుత్వాన్ని అనుమతి కోసం కోరగా.. అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం.. రాష్ట్రంలో అప్పుడు అమలులో ఉన్న నిబంధనల ప్రకారం అనుమతులు జారీ చేసింది. అప్పుడు కూడా సుప్రీంకోర్టు మార్గదర్శకాల ఆధారంగానే అనుమతులు ఇచ్చామని అప్పటి ప్రభుత్వం చెప్పడంతో.. అవే మార్గదర్శకాలను ఇప్పుడు కూడా అమలు చేశామని చెబుతోంది. ఏది ఏమైనా.. లోకేశ్ పాదయాత్రకు కావాలని జగన్ ప్రభుత్వం నిబంధనల విషయంలో కఠినంగానే వ్యవహరిస్తోందని టీడీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు.