YS Jagan : కేంద్రానికి జగన్ పర్ఫెక్ట్ ఛాలెంజ్… ఏపీకి గుడ్ డేస్
YS Jagan : ఒక రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక ముఖ్యమంత్రిగా ఎంత చేయాలో అంతకంటే ఎక్కువే సీఎం జగన్ చేస్తున్నారు. ఏపీ అభివృద్ధి కోసం సీఎం జగన్ ఎక్కువే కృషి చేస్తున్నారు. ఇప్పటికే కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పలు ప్రతిపాదలను పంపింది. అవి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన తొమ్మిది ప్రపోజల్స్. ఏపీలో పారిశ్రామికాభివృద్ధిని పెంచేందుకు సీఎం జగన్ సారథ్యంలోని ఏపీ ప్రభుత్వం ఆ ప్రపోజల్స్ ను రూపొందించింది. వాటిని అమలు చేయాలంటే కేంద్రం నుంచి కాస్తో కూస్తో ఆర్థిక సాయం అందాలి…
వీటిని కేంద్రం కనుక ఆమోదిస్తే ఏపీ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా మారడం ఖాయం. ప్రధానమంత్రి గతిశక్తి లో భాగంగా ఏపీలో పలు ప్రాజెక్టులను మంజూరు చేయాలని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి పలు ప్రతిపాదనలు పంపింది. ప్రతి శాఖకు సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్టులను కూడా కేంద్రానికి పంపించింది. ఏపీ ప్రభుత్వం పంపించిన తొమ్మిది ప్రతిపాదనలను చూస్తే.. కర్నూలు జిల్లా ఓర్వకల్ లో రూ.288 కోట్లతో, కడప జిల్లా కొప్పర్తిలో రూ.171 కోట్లతో మెగా ఇండస్ట్రియల్ హబ్ ల కోసం నీతి వసతి, రోడ్ కనెక్టివిటీ పెంచడం లాంటి ప్రపోజల్స్ ఉన్నాయి. పీఎం గతి శక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ లో భాగంగా కేంద్రం మల్టీ మోడల్ కనెక్టివిటీ ప్రాజెక్టులను అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
YS Jagan : కర్నూలు జిల్లా ఓర్వకల్ లో 288 కోట్లతో అభివృద్ధి పనులు
ఈ మాస్టర్ ప్లాన్ ఆధారంగానే తొమ్మిది ప్రతిపాదలను కేంద్రానికి అందజేసింది ఏపీ ప్రభుత్వం. ఈ తొమ్మిది ప్రాజెక్టులను అమలు చేయాలంటే కనీసం రూ.782 కోట్లు అవుతాయని ఏపీ ప్రభుత్వం అంచనా వేసింది. అయితే.. ఈ ఆర్థిక సంవత్సరంలో పీఎం గతి శక్తి కింద కేంద్రం సుమారు రూ.5000 కోట్లను దశలవారీగా మంజూరు చేయనుంది. తిరుపతి జిల్లా నాయుడుపేటలో, చిత్తూరు జిల్లా రౌతు సురమల పారిశ్రామిక క్లస్టర్ కనెక్టివిటీ కోసం భూమిని సేకరించడం, నేషనల్ హైవే 16 విస్తరణ లాంటి పనుల ప్రతిపాదనలు కేంద్రం వద్ద ఉన్నాయి. అలాగే.. అచ్యుతాపురం, అనకాపల్లి రోడ్డు వెడల్పు, కియా మోటర్స్ ప్లాంట్ కు కనెక్టివిటీ, భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ డెవలప్ మెంట్ లాంటి ప్రతిపాదలను కేంద్రానికి పంపించింది.