ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల విషయం గందరగోళంగా ఉంది. నిమ్మగడ్డ రమేష్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని ప్రకటించారు. మరో వైపు సీఎస్ మాత్రం ఎన్నికలకు సహకరించేది లేదు అంటూ తేల్చి చెప్పారు. ప్రస్తుతం కరోనా వ్యాక్సినేషన్ మరియు ఇతర పరిస్థితుల కారనంగా ఉద్యోగులు ఈ సమయంలో ఎన్నికల విధులు నిర్వహించలేరు. అలాగే ఎన్నికలకు సంబంధించి ఎలాంటి పనులు చేయలేరు అంటూ చెప్పుకొచ్చారు. సుప్రీం కోర్టుకు ఈ కేసు వెళ్లడానికి ముందు హైకోర్టులో ఈ కేసు నడిచింది. ఆ సమయంలో హైకోర్టు ఎన్నికల సంఘంకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే సుప్రీం కోర్టుకు వెళ్తున్న కారణంగా అక్కడ తీర్పు వచ్చే వరకు ఎన్నికల హడావుడికి బ్రేక్ వేయాలని హైకోర్టుకు సీఎస్ తెలియజేశాడు.
ఒక ఎస్సై తన ప్రమోషన్ విషయమై కోర్టును ఆశ్రయించాడు. తనకు ప్రమోషన్ రాకపోవడంతో కోర్టుకు ఎక్కిన అతడికి సమాధానం చెప్పాలంటూ డీజీపీ మరియు హోం శాఖ కార్యదర్శులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలకు ఈ ఇద్దరు కూడా ప్రస్తుతం ఎన్నికల విధుల్లో ఉన్న కారణంగా తాము కోర్టుకు హాజరు అయ్యే అవకాశం లేదు అంటూ చెప్పుకొచ్చారు. దాంతో కోర్టు వారిపై అసహనం వ్యక్తం చేసింది. సుప్రీం తీర్పు వచ్చే వరకు ఎన్నికల విధులు ఉండవు. అయినా కూడా మీరు ఎలా ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. సుప్రీం తీర్పు వచ్చిన తర్వాతే ఎన్నికలకు సంబంధించిన నిర్ణయం తీసుకుంటామని సీఎస్ చెప్పినా మీరు మాత్రం ఎలా ఎన్నికల విధుల్లో ఉన్నారంటూ హైకోర్టు ప్రశ్నించింది.
ఒక వైపు రాష్ట్రంలో ఎన్నికల పక్రియను వాయిదా వేయించేందుకు ప్రయత్నిస్తూ వస్తున్న వైఎస్ జగన్ కు డీజీపీ మరియు హోం శాఖ కార్యదర్శి చేసిన పనితో తల నొప్పి మొదలు అయ్యింది. వారు కోర్టులో తాము ప్రస్తుతం ఎన్నికల విధుల్లో ఉన్నామంటూ చెప్పి వారి పరువు వారు తీసుకున్నారు. దాంతో పాటు వైఎస్ జగన్ పరువును కూడా కోర్టులో తీసేశారు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికలకు వెళ్లే పరిస్థితి వచ్చింది. వైకాపా కూడా ఎన్నికల్లో పాల్గొనేందుకు ఓకే అన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఉద్యోగ సంఘాల నాయకులు మరియు ఇతరులు కూడా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఆసక్తిగా ఉన్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.