AP High Court: వాళ్ళ పరువు పోగొట్టుకుని కోర్టు నడిబొడ్డులో జగన్ పరువు పోగొట్టారు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

AP High Court: వాళ్ళ పరువు పోగొట్టుకుని కోర్టు నడిబొడ్డులో వైఎస్‌ జగన్ పరువు పోగొట్టారు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల విషయం గందరగోళంగా ఉంది. నిమ్మగడ్డ రమేష్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేయడంతో పాటు ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిందని ప్రకటించారు. మరో వైపు సీఎస్‌ మాత్రం ఎన్నికలకు సహకరించేది లేదు అంటూ తేల్చి చెప్పారు. ప్రస్తుతం కరోనా వ్యాక్సినేషన్‌ మరియు ఇతర పరిస్థితుల కారనంగా ఉద్యోగులు ఈ సమయంలో ఎన్నికల విధులు నిర్వహించలేరు. అలాగే ఎన్నికలకు సంబంధించి ఎలాంటి పనులు చేయలేరు అంటూ చెప్పుకొచ్చారు. సుప్రీం కోర్టుకు ఈ కేసు వెళ్లడానికి […]

 Authored By himanshi | The Telugu News | Updated on :26 January 2021,2:00 pm

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల విషయం గందరగోళంగా ఉంది. నిమ్మగడ్డ రమేష్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేయడంతో పాటు ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిందని ప్రకటించారు. మరో వైపు సీఎస్‌ మాత్రం ఎన్నికలకు సహకరించేది లేదు అంటూ తేల్చి చెప్పారు. ప్రస్తుతం కరోనా వ్యాక్సినేషన్‌ మరియు ఇతర పరిస్థితుల కారనంగా ఉద్యోగులు ఈ సమయంలో ఎన్నికల విధులు నిర్వహించలేరు. అలాగే ఎన్నికలకు సంబంధించి ఎలాంటి పనులు చేయలేరు అంటూ చెప్పుకొచ్చారు. సుప్రీం కోర్టుకు ఈ కేసు వెళ్లడానికి ముందు హైకోర్టులో ఈ కేసు నడిచింది. ఆ సమయంలో హైకోర్టు ఎన్నికల సంఘంకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే సుప్రీం కోర్టుకు వెళ్తున్న కారణంగా అక్కడ తీర్పు వచ్చే వరకు ఎన్నికల హడావుడికి బ్రేక్ వేయాలని హైకోర్టుకు సీఎస్‌ తెలియజేశాడు.

AP High Court: రాష్ట్ర హైకోర్టులో ఇంట్రెస్టింగ్‌ సంఘటన..

ap high court fire on dgp and home dept secretary

ap high court fire on dgp and home dept secretary

ఒక ఎస్సై తన ప్రమోషన్ విషయమై కోర్టును ఆశ్రయించాడు. తనకు ప్రమోషన్‌ రాకపోవడంతో కోర్టుకు ఎక్కిన అతడికి సమాధానం చెప్పాలంటూ డీజీపీ మరియు హోం శాఖ కార్యదర్శులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలకు ఈ ఇద్దరు కూడా ప్రస్తుతం ఎన్నికల విధుల్లో ఉన్న కారణంగా తాము కోర్టుకు హాజరు అయ్యే అవకాశం లేదు అంటూ చెప్పుకొచ్చారు. దాంతో కోర్టు వారిపై అసహనం వ్యక్తం చేసింది. సుప్రీం తీర్పు వచ్చే వరకు ఎన్నికల విధులు ఉండవు. అయినా కూడా మీరు ఎలా ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. సుప్రీం తీర్పు వచ్చిన తర్వాతే ఎన్నికలకు సంబంధించిన నిర్ణయం తీసుకుంటామని సీఎస్‌ చెప్పినా మీరు మాత్రం ఎలా ఎన్నికల విధుల్లో ఉన్నారంటూ హైకోర్టు ప్రశ్నించింది.

వారిపై వైఎస్‌ జగన్ అసంతృప్తి..

ఒక వైపు రాష్ట్రంలో ఎన్నికల పక్రియను వాయిదా వేయించేందుకు ప్రయత్నిస్తూ వస్తున్న వైఎస్‌ జగన్‌ కు డీజీపీ మరియు హోం శాఖ కార్యదర్శి చేసిన పనితో తల నొప్పి మొదలు అయ్యింది. వారు కోర్టులో తాము ప్రస్తుతం ఎన్నికల విధుల్లో ఉన్నామంటూ చెప్పి వారి పరువు వారు తీసుకున్నారు. దాంతో పాటు వైఎస్‌ జగన్‌ పరువును కూడా కోర్టులో తీసేశారు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికలకు వెళ్లే పరిస్థితి వచ్చింది. వైకాపా కూడా ఎన్నికల్లో పాల్గొనేందుకు ఓకే అన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఉద్యోగ సంఘాల నాయకులు మరియు ఇతరులు కూడా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఆసక్తిగా ఉన్నారు.

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది