Andhra Pradesh : దేశంలో పెట్టుబడులలో నెంబర్ వన్ గా నిలిచిన ఏపీ..!!
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్, Andhra Pradesh, రాష్ట్ర వైయస్ జగన్, Ys Jagan, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయ్యాక రాష్ట్రంలో అనేక మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి సంక్షేమ పాలన అద్భుత రీతిలో అందిస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజు.. పార్టీలకు ప్రాంతాలకు కులాలకు మతాలకు అతీతంగా ప్రజలను అన్ని రకాలుగా పైకి తీసుకొస్తానని ఇచ్చిన మాట ప్రకారం.. పరిపాలన ఉండేలా జాగ్రత్తలు చూసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే ఒకపక్క సంక్షేమ పాలన అందిస్తూనే మరోపక్క పెట్టుబడులో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, Andhra Pradesh State Govt దూసుకుపోతూ ఉంది. ప్రతిపక్షాలు ఇటీవల రాష్ట్రంలో కంపెనీలు వెళ్ళిపోతున్నాయని ఆరోపణలు చేస్తూ ఉన్న సమయంలో.. దేశంలోనే పెట్టుబడుల్లో ఆంధ్ర మొదటి స్థానంలో నిలిచినట్లు నివేదికలు బయటపడ్డాయి. పూర్తి విషయంలోకి వెళ్తే డీపీఐఐటీ 2022 జులై నివేదిక ప్రకారం దేశంలో రూ. 1,70,000 వేల కోట్ల పెట్టుబడుల్లో ఏపీ రూ. 40 వేల కోట్లు పెట్టుబడులు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. ఇక ఇదే సమయంలో దావోస్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్న
రూ. 1.25000 కోట్లను ఇప్పటికే కేబినేట్ ఆమోదించింది. ఒక్క గ్రీన్ ఎనర్జీ రంగంలో ఏపికి రూ. 80 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి వ్యాపారవేత్తలు ముందుకు రావడం జరిగింది. ఈ రీతిగా పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే నెంబర్ 1 గా ఏపీ దూసుకుపోతుంది. సింగిల్ విండో తరహాలో ఒప్పందాలు ఉండే రీతిలో పెట్టుబడుల దారులను ఏపి ప్రభుత్వం ఆకర్షిస్తోంది. దీంతో పెట్టుబడుల విషయంలో ప్రతిపక్షాలు జగన్ ప్రభుత్వం పై చేస్తున్న ఆరోపణలలో వాస్తవం లేదని తేలిపోయింది.