AP Minister : ఆ మంత్రికి వైసీపీలో తీవ్ర అసమ్మతి.. టికెట్ ఇచ్చిన గెలుపు ఇంపాజిబుల్?
AP Minister : సాధారణంగా ఏ పార్టీలో అయినా సరే.. ఆ పార్టీ నేతలకు.. పార్టీ మద్దతు ఉంటుంది. పార్టీ నుంచే కాకుండా.. పార్టీకి చెందిన ఇతర నేతల నుంచి కూడా మద్దతు లభిస్తుంది. కానీ.. ఈ ఏపీ మంత్రికి మాత్రం తన సొంత పార్టీ నుంచే అసమ్మతి పెరుగుతోంది. ఏకంగా ఆయన్ను వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకే నేతలు సిద్ధం అయ్యారు. ప్రస్తుతం ఈ ఘటన వైసీపీలో తీవ్ర చర్చనీయాంశం అయింది. ఆయన ఎవరో కాదు.. మంత్రి అప్పలరాజు. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన అప్పలరాజుకు మంత్రి వర్గ విస్తరణలో కూడా ఆయన మంత్రి పదవి పోలేదు.
అంతకుముందే ఆయనకు మంత్రి పదవి లభించింది. అయితే.. మంత్రి అయిన తర్వాత తీరు మారిందని.. చివరకు క్షేత్ర స్థాయిలో పార్టీ నేతలను కూడా పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఆయన నియంతగా వ్యవహరిస్తున్నారని.. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయన టికెట్ ఇచ్చినా నియోజకవర్గంలో ఓడిస్తామని సొంత పార్టీ నేతలనే శపథం చేస్తున్నారు. నిజానికి అప్పలరాజు గెలుపు కోసం పార్టీ నేతలంతా చాలా కష్టపడ్డారు. ఆయన ఎమ్మెల్యే అవడమే కాదు.. మంత్రి కూడా అయ్యారు. కానీ..
AP Minister : సొంత నియోజకవర్గంలోనే అసమ్మతి వర్గం ఎందుకు?
ఆ తర్వాత అప్పలరాజు ఏకపక్షంగా వ్యవహరించడం నియోజకవర్గ నేతలకు మింగుడుపడటం లేదు. అంతే కాదు.. ఆయన అవినీతికి పాల్పడుతున్నారని.. సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో అప్పలరాజు వర్గంతో పాటు.. అసమ్మతివర్గం ఒకటి ఏర్పడింది. ఈ అసమ్మతి వర్గం వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అప్పలరాజును ఓడిస్తామని తీర్మానించింది. పార్టీ హైకమాండ్ కు కూడా ఈ విషయం తెలిసినట్టు సమాచారం కానీ.. తన పార్టీలోని అసమ్మతి వర్గాన్ని తిరిగి తన దారికి అప్పలరాజు ఎలా తెచ్చుకుంటారో వేచి చూడాల్సిందే.