Roja : కంట కన్నీరు పెట్టిన రోజా.. జబర్ధస్త్‌కి వీడ్కోలు పలకడం బాధగా ఉందన్న ఏపీ మంత్రి
Roja : ఒకప్పుడు రోజా తన నటనతో ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. స్టార్ హీరోయిన్‌గా అదరగొట్టిన ఈ అందాల ముద్దుగుమ్మ తర్వాత రాజకీయాలలోకి వచ్చింది. అనూహ్య పరిణామాల మధ్య..చివరి నిమిషంలో మంత్రి పదవి దక్కించుకున్న రోజా ఆ బాధ్యతలు స్వీకరించారు. పర్యాటక- సాంస్కృతిక, యువజన సర్వీసులు శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించటానికి ముందు రోజాకు పార్టీ నేతలు – కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు. టూరిజం మంత్రిగా బాధ్యలు చేపట్టిన రోజా తనకు క్రీడలు అంటే చాలా ఇష్టమని.. కరోనా కారణంగా క్రీడలకు దూరంగా ఉన్నారని.. అలాంటి వారిని తిరిగి క్రీడల వైపు మళ్లిస్తామన్నారు.
ఆర్కే రోజా… నగరి నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గి, తాజాగా మంత్రి పదవి చేపట్టారు.అయితే ఇప్పటివరకు రోజా ఈటీవీలో ప్రసారమయ్యే ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమంలో న్యాయనిర్ణేతగా కొనసాగారు. అయితే, ఇప్పుడు తాను మంత్రిని కావడంతో బాధ్యతలు పెరిగాయని, ఇకపై సినిమాలు, టీవీ షోలు చేయలేనని ఇటీవలే రోజా ప్రకటించారు. ఈ నేపథ్యంలో, జబర్దస్త్ టీమ్ తమ అభిమాన రోజాకు వీడ్కోలు పలికారు. ఆమె పాల్గొన్న చివరి ఎపిసోడ్ లో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రోజా కన్నీటి పర్యంతమైంది. రెండుసార్లు ఎమ్మెల్యే అయినప్పుడు జబర్దస్త్ లోనే ఉన్నానని, ఇప్పుడు మంత్రి అయినప్పుడు కూడా ఇక్కడే ఉన్నానని సంతోషం వ్యక్తం చేశారు.
Roja : కన్నీరు పెట్టుకున్న రోజా
తనకు సేవ చేయడం ఎంతో ఇష్టమని, అందుకే జబర్దస్త్ వంటి ఇష్టమైన కార్యక్రమాలను వదులుకోవాల్సి వస్తోందని భావోద్వేగాలతో చెప్పారు. తనకు అవకాశమిచ్చిన ఈటీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. కాగా, రోజా వీడ్కోలు ఎపిసోడ్ లో ఇతర యాంకర్లు, పార్టిసిపెంట్లు కంటతడి పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను ఈటీవీ విడుదల చేసింది. త్వరలోనే ఈ స్పెషల్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. పార్టీ కోసం జెండా పట్టుకొని నడిచిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని చెప్పారు. మంత్రివర్గ కూర్పు మొత్తం సామాజిక – ప్రాంతీయ సమీకరణా ల ఆధారంగానే ఫైనల్ అయిందని వివరించారు.