Ys Jagan : ఏపీ మంత్రికి ఎందుకు ఇలా జరుగుతోంది.. వెంటనే ఆరా తీసిన వైఎస్ జగన్
Ys Jagan : ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజుకు మావోయిస్టుల నుంచి లేఖ అందడం అందరికీ తెలిసిందే. అసలు.. మావోయిస్టుల నుంచి అప్పలరాజుకు లేఖ అందడం ఏంటంటూ రాష్ట్రవ్యాప్తంగా అందరూ చర్చిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశమైంది. అయితే.. అప్పలరాజు మంత్రి అవుతారని ఎవ్వరూ ఊహించలేదు. ఆయన రాజకీయాల్లోకి రావడమే కాదు.. వెంటనే ఎమ్మెల్యే ఆ తర్వాత మంత్రి కూడా అయిపోయారు. అప్పలరాజుకు రెండో సారి మంత్రివర్గ విస్తరణ సమయంలోనూ మంత్రి పదవి కంటిన్యూ అయింది. అదే ఆయన అదృష్టం అనుకోవాలి.
నిజానికి జిల్లాలో చాలామంది వైసీపీ సీనియర్లు ఉన్నా అప్పలరాజు మాత్రం కాస్త దూకుడుగా ఉంటారనే టాక్ ఉంది.అదే ఆయన్ను ఇంకా మంత్రి పదవిలో ఉండేలా చేసింది. కానీ.. ఇప్పుడు అదే దూకుడుతనం ప్రతిబంధకంగా మారినట్టుంది. అసలు మావోయిస్టులు ఆయన్ను ఎందుకు టార్గెట్ చేశారో తెలియడం లేదు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఇదే చర్చ నడుస్తోంది. నిజానికి మంత్రి అప్పలరాజుది పలాస నియోజకవర్గం. అది రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా. అక్కడ అపారమైన భూవనరులు ఉన్నాయి. చాలా ఏళ్ల నుంచి అక్కడ ఉన్న ప్రభుత్వ భూములను నిరుపేద రైతులే సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

ap minister appalaraju gets series of letters from maoists
Ys Jagan : వివాదాస్పద భూముల్లో తలదూర్చినందుకేనా?
అయితే.. ప్రస్తుతం ఆ భూములపై అధికార పార్టీ నాయకుల కన్ను పడింది. దీంతో ఆ భూములను స్వాధీనం చేసుకుంటున్నారని తెలుస్తోంది. వాళ్లంతా మంత్రి అనుచరులే కావడం.. వాళ్లు వివాదాస్పద భూముల్లో తలదూర్చడం వల్లనే ఈ విషయం మావోయిస్టుల దృష్టికి వెళ్లి మంత్రికి లేఖ పంపించారా అనేది తెలియడం లేదు. అయితే.. వైసీపీ నేతలు ఎవ్వరూ రైతుల భూముల జోలికి పోలేదని.. వాళ్లెవరూ మంత్రుల అనుచరులు కాదని అంటున్నారు. కానీ.. వాళ్లు మంత్రి అనుచరులు అనుకొని మావోయిస్టులు మంత్రికి లేఖ పంపించారని వైసీపీ నేతలు చెబుతున్నారు. దానిపై సీఎం జగన్ కూడా ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. మంత్రి అప్పలరాజు విషయంలో సీఎం జగన్ కూడా ఎందుకు ఇలా జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.