Roja – Pattabhi : గిల్లవా గిల్లవా అంటే రసగుల్ల రసం పిండేశారు.. పట్టాభి అరెస్ట్‌పై రోజా రియాక్షన్
Roja – Pattabhi : ప్రస్తుతం ఏపీలో పట్టాభి ఘటనే బర్నింగ్ టాపిక్ అయింది. గన్నవరం వెళ్లి మరీ.. అక్కడ వల్లభనేని వంశీ, కొడాలి నానిపై బూతు పురాణం చేసిన పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గన్నవరం సంఘటన గురించే రాష్ట్రమంతా ప్రస్తుతం మాట్లాడుకుంటోంది. పోలీసులే రౌడీలుగా వ్యవహరిస్తున్నారు అంటూ టీడీపీ నేతలు రచ్చ రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా ఏపీ మంత్రి ఆర్కే రోజా స్పందించారు. టీడీపీ హయాంలో ఇంతకంటే ఎక్కువ దాడులు జరిగాయి. పోలీసులను అడ్డం పెట్టుకొని టీడీపీ నేతలు చాలా దాడులకు పాల్పడ్డారు.
అలాంటి చాలా సంఘటనలు ఉన్నాయి. రౌడీయిజానికి, సైకోయిజానికి కేరాఫ్ అడ్రస్ ఎవరు అంటే అది చంద్రబాబునాయుడు. పోలీస్ వ్యవస్థను తనకు అనుకూలంగా చాలా విషయాల్లో వీళ్లు ఉపయోగించుకొని ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న తీరును చూసి జనాలు నవ్వుకుంటున్నారు. టీడీపీకి ఏపీలో అడ్రస్ లేదు. ఏపీ ప్రజలు తరిమి కొడితేనే హైదరాబాద్ కు వెళ్లి ఉంటున్నారు. వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్ లో కూడా ఉండరు. అక్కడి నుంచి కూడా తరిమికొడతారు. శెభాష్ అంటూ సీఎం జగన్ పథకాలను కేంద్రంతో పాటు ఇతర రాష్ట్రాలు కూడా పొగుడుతున్నాయి.
Roja – Pattabhi : టీడీపీకి అడ్రస్ లేదు
అలాంటి నాయకుడిని దౌర్భాగ్యులతో తిట్టిస్తారా? తనను ఏమన్నా కూడా దేవుడే శిక్షిస్తాడు అని జగన్ మోహన్ రెడ్డి అనుకుంటారు. తనకున్న సమయంలో ప్రజలకు ఏవిధంగా సాయం చేయాలి, ఎలాంటి సంక్షేమ పథకాలు అందించాలి అనేదానిపైనే ఎప్పుడూ ఆలోచిస్తుంటారు అంటూ రోజా చెప్పారు. గన్నవరం వెళ్లి మరీ అక్కడ రచ్చ చేసి మరీ పట్టాభి తన గోతి తానే తీసుకున్నాడు. గిల్లవా గిల్లవా అంటే రసగుల్ల రసం పిండేశారు అంటూ పట్టాభిని ఉద్దేశిస్తూ రోజా సంచలన కామెంట్స్ చేశారు.