YCP : ఏపీ మంత్రుల బస్సు యాత్ర.! వైసీపీ టార్గెట్ 175.! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YCP : ఏపీ మంత్రుల బస్సు యాత్ర.! వైసీపీ టార్గెట్ 175.!

 Authored By prabhas | The Telugu News | Updated on :20 May 2022,10:00 am

YCP : అసెంబ్లీ నియోజకవర్గాల్లో 151 సీట్లకు ఒక్కటి కూడా తగ్గకూడదు. 175 సీట్లే లక్ష్యంగా ప్రజలతో మమేకం అవ్వాలి.. అంటూ వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేసిన దరిమిలా.. ఆ దిశగానే వైసీపీ కార్యక్రమాలు కనిపిస్తున్నాయి. ‘గడప గడపకీ వైఎస్సార్సీ..’, ‘గడప గడపకీ మన ప్రభుత్వం..’ పేర్లతో వైసీపీ ఓ అద్భుతమైన ప్రచార కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రారంభించిన సంగతి తెలిసిందే.కొన్ని నియోజకవర్గాల్లో ప్రజల నుంచి కొంత మేర ప్రతిఘటన ఎదురవుతున్నా, అది ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ పన్నిన కుట్రలో భాగమేనని వైసీపీ భావిస్తోంది. ఎక్కడికక్కడ తమకు జనం నీరాజనాలు పలుకుతున్నారన్నది వైసీపీ నేతల వాదనగా కనిపిస్తోంది. విపక్షాలు, దానికి తోడు వైసీపీ వ్యతిరేక మీడియా చేస్తున్న దుష్ప్రచారం నేపథ్యంలో..

మరింత అప్రమత్తంగా వుండాలన్నది వైసీపీ నేతలకు, అధినేత చేసిన సూచన.తాజాగా వైసీపీ, మంత్రుల బస్సు యాత్రకు ప్లాన్ చేసిన విషయం విదితమే. బస్సులో మంత్రులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తారు. ఇదంతా ఇప్పుడు ఎన్నికల సీజన్ అయితే ఎలా వుంటుంది.? అన్న కోణంలోనే జరగనుంది. ఔను, రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది.ఇంకో రెండేళ్ళ వరకు వైసీపీ ప్రభుత్వానికి అవకాశం వున్నాగానీ, ముందస్తు ఎన్నికలకు వైఎస్ జగన్ వెళితే.?

AP Ministers Bus Tour YCP Target 175

AP Ministers Bus Tour, YCP Target 175

అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న దరిమిలా, అదొక సన్నాహక కార్యక్రమంగా వైసీపీ భావిస్తున్నట్టుంది. మరింత అగ్రెసివ్‌గా జనంలోకి వెళుతున్నారు వైసీపీ నేతలు. కాగా, మంత్రుల బస్సు యాత్ర, తమ పార్టీ ఆవిర్భావ వేడుకలకు పోటీగా.. అంటూ ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ వింత వాదనకు తెరలేపింది. అధికారంలో వున్నప్పుడు చంద్రబాబు అండ్ టీమ్ చేసిన యాత్రలతో పోల్చితే, వైసీపీ చేస్తున్నది ఆక్షేపణీయమేమీ కాదు.ఏదిఏమైనా, నేతలు.. అందునా మంత్రులు కూడా నిత్యం జనంలో వుంటే, తమ పార్టీ 2024లో మరింత ఘనవిజయం సాధిస్తుందన్న వైఎస్ జగన్ ఆలోచన అద్భుతం. 175 సీట్లలో ఎందుకు గెలవం.? అని పట్టుదలతో వున్న వైఎస్ జగన్, అనుకున్నది సాధించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది