Ap New Ministers : కొత్త మంత్రుల పని తీరుపై ప్రజలు సంతృప్తి
Ap New Ministers : దేశంలో ఎక్కడా ఎప్పుడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో మంత్రి వర్గ విస్తరణ జరిగిన విషయం తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనూహ్యంగా 80 నుంచి 85 శాతం మంది మంత్రులను తొలగించి కొత్త వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. పాత వారిని తొలగించి కొత్త వారిని మంత్రులుగా చేయడం పట్ల కొందరు విమర్శలు చేసిన కూడా ప్రస్తుతం ప్రజల నుండి సానుకూల స్పందన లభిస్తోంది. కొత్త మంత్రులు పనులు చేసే విషయం లో చాలా సీరియస్ గా ఉంటున్నారు అని.. వచ్చే ఎన్నికల తర్వాత తన మంత్రి పదవి కొనసాగాలంటే
ప్రజల్లో మంచి పేరు సాధించాలనే ఉద్దేశ్యంతో ప్రజలకు చేరువగా ఉంటున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్రజలకు మంచి చేయడం ద్వారా, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మళ్లీ మంత్రి పదవుల్లో కొనసాగే ఉద్దేశంతో మంత్రులు పని చేస్తున్నారని.. దాని వల్ల మంచి జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల ప్రతి ఒక్క సామాన్య ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాత మంత్రుల విషయంలో కొన్ని విమర్శలు వివాదాలు నెలకొన్న నేపథ్యంలో కొత్త మంత్రులు స్పీడ్ గా పనులు చేస్తూ ప్రతి ఒక్కరిని కలుపు పోతూ ఉన్నారు.

ap new ministers doing good job says people
కొత్త మంత్రుల పనితీరు పై సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా సంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. మంత్రి పదవి దక్కించుకున్న ప్రతి ఒక్కరు కూడా అప్పుడే తమ పనిలోకి దిగి పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన విషయాల్లో దృష్టి పెడుతున్నారు అని, అలాగే ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు.. అందవలసిన పథకాల గురించి కూడా ఆరా తీస్తున్నారని తెలుస్తుంది. కొత్త మంత్రులు రాకతో పరిపాలన కొత్తగా ఉందంటూ ప్రభుత్వ అధికారులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ పద్ధతి సూపర్హిట్ అయిన కారణంగా ముందు ముందు కూడా జగన్ ఇదే పద్ధతిని ఫాలో అవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు.