Ap New Ministers : కొత్త మంత్రుల రాకతో పరుగులు పెడుతున్న పరిపాలన
Ap New Ministers : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దేశంలో ఎప్పుడు జరగని విధంగా మంత్రి వర్గ ప్రక్షాళన చేసిన విషయం తెల్సిందే. దేశ వ్యాప్తంగా ఎప్పుడు జరగని విధంగా మంత్రి వర్గ కూర్పు జరిగింది. అధికారంలోకి వచ్చిన సమయంలోనే రెండున్నర ఏళ్లకు మంత్రి వర్గం మారుస్తాను అంటూ ఆయన ప్రకటించాడు. అన్నట్లుగానే దాదాపుగా 80 శాతం మంది కొత్త మంత్రులను తీసుకు వచ్చాడు.
మంత్రి వర్గ విస్తరణ లో కొత్త వారికి చోటు దక్కింది. పాత వారు కొందరు ఉండటంతో వారి నుండి పాఠాలు నేర్చుకునే అవకాశం కూడా దక్కింది. ఇక కొత్త వారు ఇప్పుడు పనుల విషయంలో స్పీడ్ కనబర్చుతున్నారు. ఉండేది మరో రెండున్నర సంవత్సరాలు మాత్రమే కనుక ఈ సమయంలోనే తమ ముద్ర వేస్తే తప్పకుండా మళ్లీ అవకాశం వస్తుందనే నమ్మకంతో వారు ఉన్నారు.

ap new ministers going speed in there work
రాబోయే రెండు సంవత్సరాల్లో ఖచ్చితంగా మంత్రి వర్గంలోని జూనియర్ మంత్రులు అద్బుతమైన అనుభవంను ఘడిస్తారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. తమను తదుపరి మంత్రి వర్గంలో కొనసాగించాలనే ఉద్దేశ్యంతో కొత్త మంత్రులు పరుగులు పెడుతూ పనులు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. వారి పని తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.