ఒక్కసారి జంప్ చేస్తే.. ఫ్యూచరే లేకుండా పోయింది.. సీనియర్ నేత భవిష్యత్తు..?
TDP : రాజకీయాల్లో అయినా.. ఉద్యోగంలో అయినా.. ఇంకెక్కడైనా.. సరైన నిర్ణయం అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఒక్కసారి పప్పులో కాలేస్తే.. ఆ తప్పు వల్ల జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఉద్యోగం మారినా.. పార్టీ మారినా.. ఆ పార్టీలో ఆ సమయానికి ఇచ్చే పదవుల కన్నా.. పార్టీలో భవిష్యత్తు ఎలా ఉంటుంది.. అనే దాన్ని అంచనా వేసుకొని పార్టీ మారాలి. లేదంటే అసలుకే ఎసరు వస్తుంది. ఒక్కోసారి కొందరు నేతలు పార్టీ మారినప్పుడు బాగానే ఉంటుంది. పదవులు కూడా ఇస్తారు. కానీ.. రాను రాను.. ఆ నేతలను పార్టీలో పట్టించుకునేవాడే ఉండడు. అప్పుడే వాళ్లలో అసంతృప్తి స్టార్ట్ అవుతుంది. అప్పుడు మళ్లీ సొంత పార్టీకి వెళ్లాలని ఉన్నా.. వెళ్లలేరు. ఇలా.. తమలో తామే మథనపడుతూ.. ఎందుకు పార్టీ మారాం దేవుడా? అంటూ తలలు పట్టుకొని కూర్చున్న నేతలు ఏపీలో కోకొల్లలు. ఎందుకంటే.. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుతుంటాయి అనే విషయాన్ని మనం మరిచిపోతే ఇలాగా ఉంటుంది.
ప్రస్తుతం ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రంపచోడవం టీడీపీ నేత వంతల రాజేశ్వరి పరిస్థితి కూడా అలాగే ఉందట. వైసీపీ నుంచి టీడీపీలోకి పార్టీ మారిన రాజేశ్వరిని ప్రస్తుతం పట్టించుకునే నాథుడే కరువయ్యాడట. వంతల రాజేశ్వరి.. వైసీపీ అధినేత జగన్ కు విధేయురాలుగా ఉండేది. తనకు లక్ లో 2014 లో వైసీపీ నుంచి టికెట్ దక్కింది. టికెట్ దక్కడమే కాదు.. తను భారీ మెజారిటీతో రంపచోడవరంలో గెలిచి తన సత్తాను చాటింది. అంతవరకు బాగానే ఉంది కానీ.. ఆమె వైసీపీ ఎమ్మెల్యేగా ఉండగానే.. 2017లో వైఎస్సార్సీపీ పార్టీని వదిలేసి.. టీడీపీలో చేరింది. అయితే.. టీడీపీలో తనకు ఏ పదవిని కూడా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆఫర్ చేయకున్నా కూడా.. భవిష్యత్తులో ఏదైనా పదవి వస్తుందనే ఆశతో రాజేశ్వరి పార్టీ మారింది. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుంది.. టీడీపీ నామరూపం లేకుండా పోతుందని ఆసమయానికి ఆమె ఊహించలేదు కదా. అందుకే పార్టీ మారింది.
TDP : 2019 లో రాజేశ్వరి అడ్రస్సే గల్లంతయింది
అయితే.. 2019 ఎన్నికల్లో చంద్రబాబు రంపచోడవరం నుంచి రాజేశ్వరికి టికెట్ ఇచ్చారు. కానీ.. రాజేశ్వరి మాత్రం ఘోరంగా ఓడిపోయారు. అప్పటి నుంచి తన రాజకీయ భవిష్యత్తు గందరగోళంలో పడింది. అగమ్యగోచరంగా మారింది. అసలు.. 2024 ఎన్నికల సమయానికి తన అడ్రస్ ఉంటుందా? ఉండదా? అనే డౌట్ రంపచోడవరం రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది. రాజేశ్వరి 2017 లో టీడీపీలో చేరకుండా ఉండి ఉంటే.. ఇప్పుడు తన లైఫ్ వేరేలా ఉండేదని.. తన రాజకీయ భవిష్యత్తును తానే నాశనం చేసుకుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనా.. చంద్రబాబును గుడ్డిగా నమ్మి పార్టీలో చేరినందుకు తనకు రాజకీయ భవిష్యత్తే లేకుండా పోయింది. ఒకే ఒక్క రాంగ్ స్టెప్ ఎంత దూరం వెళ్లిందో చూశారా? ఇలా ఒక్క రాజేశ్వరి మాత్రమే కాదు.. చాలామంది నేతలు ఒక్క టప్పటడుగు వేసి తమ రాజకీయ భవిష్యత్తును తమ చేజేతులారా నాశనం చేసుకున్నారు.