AP Fishermen | మత్స్యకార కుటుంబాలకు రూ.5.30 కోట్లు పరిహారం విడుదల.. నిధులు మంజూరు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

AP Fishermen | మత్స్యకార కుటుంబాలకు రూ.5.30 కోట్లు పరిహారం విడుదల.. నిధులు మంజూరు

 Authored By sandeep | The Telugu News | Updated on :14 October 2025,2:30 pm

AP Fishermen | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యకార కుటుంబాలకు సంబంధించి నిధులు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలకు రూ.5.30 కోట్ల పరిహారం విడుదల చేసింది. 19 జిల్లాల్లోని 106 మంది కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున జీఏఐఎస్‌ (గ్రూప్‌ యాక్సిడెంట్‌ ఇన్సూరెన్స్‌ పథకం) కింద ఈ పరిహారాన్ని అందించనుంది. ఈ మేరకు మత్స్యకారశాఖ నుంచి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు అధికారులు.

#image_title

నిధులు విడుద‌ల‌..

ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన ఈ పరిహారం విషయానికి వస్తే.. ‘కాకినాడ జిల్లాలో 18, శ్రీకాకుళం 17, కృష్ణా 13, బాపట్ల 11, అంబేడ్కర్‌ కోనసీమ 10, అనకాపల్లి 9 మందితోపాటుగా.. విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, శ్రీసత్యసాయి, నంద్యాల జిల్లాలోని 27 మంది కుటుంబాలకు పరిహారం విడుదలైంది. ఏపీ ప్రభుత్వం మత్స్యకారులకు రూ.5 లక్షల చొప్పున జీఏఐఎస్‌ కల్పిస్తోంది. ఈ మేరకు ఆ పరిహారం డబ్బుల్ని తాజాగా విడుదల చేసింది.

ఏపీ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖకు అవసరమైన పరికరాల సరఫరాకు సంబంధించిన టెండర్ ప్రక్రియను పూర్తి చేసింది. అన్ని జిల్లాలకు అవసరమైన 267 రకాల పరికరాలను, సుమారు రూ.5 కోట్ల విలువైన వాటిని సరఫరా చేసేందుకు ఎల్‌-1గా ఎంపికైన కంపెనీలతో ఒప్పందం చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ టెండర్లు వచ్చే ఏడాది వరకు అమలులో ఉంటాయి. పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌కు ఈ ఒప్పందాలు చేసుకునే అధికారాన్ని ప్రభుత్వం కల్పించింది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది