iphone14 : త్వరలోనే మార్కెట్ లోకి ఐఫోన్ 14.. అదిరిపోయే ఫీచర్స్ తో..
iphone14 : యాపిల్ ఐఫోన్ లవర్స్‌కు తొందర్లోనే గుడ్ న్యూస్ చేప్పనుంది ఆ సంస్థ. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లు సెప్టెంబర్ 13న విడుదల చేయనున్నట్లు టెక్ వర్గాలు చెబుతున్నాయి. కాగా ఐఫోన్ 14 సిరీస్ ఫోన్ ప్రారంభ ధర రూ. 64వేల నుంచి రూ.71,500 వరకు ఉండనున్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే గతేడాది విడుదలైన ఐఫోన్ 13 సిరీస్ ఫోన్‌ల వరకు ఏ15
కానీ గేమింగ్ పర్ఫామెన్స్ కోసం యాపిల్ సంస్థ ఐ ఫోన్ 14 ప్రో ఫోన్‌లలో మాత్రమే ఈ ఏ16 ప్రాసెసర్ ను అందిచనున్నట్లు సమాచారం. మ్యాక్ వరల్డ్ నివేదిక ప్రకారం.. ఏ 16 బయోనిక్ ప్రాసెసర్ చాలా ప్రత్యేకమైందని తెలుస్తోంది. టీఎస్‌ఎంసీ 5 ఎన్‌ఎంతో ఈ అడ్వాన్స్ వెర్షన్ ప్రాసెసర్‌ను తయారు చేశారు. 18 బిలియన్ నుంచి 20 బిలియన్ ట్రాన్సిస్టర్‌లతో రానుంది. కాగా ఏ15లో ప్రాసెసర్ లో 15.8 బిలియన్ల నుంచి పెరిగింది.
iphone14: స్పెసిఫికేషన్లు ఇవే..
కాగా ఐఫోన్14 ఫోన్ 6.1 ఇంచెస్ డిస్‌ప్లే కలిగి ఉంది. వీడియోలు చూసేందుకు, గేమ్స్ ఆడేందుకు 1170*2532 పిక్సెల్స్ రెజెల్యూషన్, 4 జీబీ ర్యామ్ ప్లస్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సౌకర్యం ఉంది. ఇక డ్యూయెల్ సెటప్ రేర్ కెమెరా ఉంది. ఫోటోల్ని తీసేందుకు 12 ఎంపీ ప్లస్ 12 ఎంపీ కెమెరాలు,సెల్ఫీల కోసం, వీడియో కాల్స్ చేసుకునేందుకు ఫోన్ ముందు భాగంలో 12 ఎంపీ ప్లస్ ఎస్‌ఎల్ 3డీ కెమెరాతో రానుంది. ఐఓఎస్ వీ 15 ఆపరేటింగ్ సిస్టం, 3115 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. దీంతో పాటు పలు రకాలైన కనెక్టివిటీ ఆప్షన్ ఉన్నాయి. ముఖ్యంగా వైఫై, మొబైల్ హాట్ స్పాట్, బ్లూటూత్, 5జీ నెట్ వర్క్‌కు సపోర్ట్ చేయనుంది. దీతో ఐఫోన్ లవర్స్ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.ప్రాసెసర్ ఉండేది. కాగా ఐఫోన్ 14 ప్రాసెసర్ పెరగనున్నట్లు సమాచారం. అయితే మరికొన్ని నెలల్లో మార్కెట్‌కు పరిచయం కానున్న ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లలో ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌లలో ఏ15కు అడ్వాన్స్ వెర్షన్‌గా ఏ16 ప్రాసెసర్ ఉంటుందని పలు నివేదికల ఆధారంగా తెలుస్తోంది.